రాష్ట్రీయం

వారు దోషులు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్య కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడిన నిందితులను హైకోర్టు సోమవారం నాడు నిర్ధోషులుగా ప్రకటించింది. రాజకీయ ఒత్తిళ్లతోనే కేసులో బాధితులను నిందితులుగా చేర్చారని తీవ్రమైన వ్యాఖ్యలను హైకోర్టు చేసింది. జస్టిస్ పి వి సంజయ్‌కుమార్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొనకాల జమలయ్య, ఆయన భార్య మంగమ్మ, కొడుకు కోటేశ్వరరావులు దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన అనంతరం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఖమ్మం ఫ్యామలీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను వారు హైకోర్టులో సవాలు చేశారు. 2007 ఫిబ్రవరి 28న జరిగిన జంట హత్యల కేసులో పిటీషనర్లుపై ఫిర్యాదు రావడంతో విచారణ అనంతరం 2011లో నలుగుర్ని ముద్దాయిలుగా గుర్తించిన దిగువ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే హైకోర్టులో పిటీషన్ సందర్భంగా కేసు పరిశోధనలోనూ, దర్యాప్తులోనూ అనేక లోపాలున్నట్టు న్యాయస్థానం గుర్తించింది. ముద్దాయిలు కూడా ఈ కేసులో తీవ్రంగా గాయపడ్డారని, వారిని పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, కేసు విచారణలో వీరు ఎందుకు గాయపడ్డారో పేర్కొనలేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రాజకీయ వైషమ్యాలు కూడా ఈ కేసులో కనిపిస్తున్నాయని, రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారని, కేసు పరిశోధనలో స్థిరత్వం కనిపించలేదని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. యావజ్జీవాన్ని కొట్టి వేసిన న్యాయమూర్తులు బెయిల్ ఉన్న నిందితులు వెంటనే వరంగల్ కేంద్రకారాగార సూపరింటెండెంట్ ముందు హాజరై శిక్ష రద్దు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
కంచ ఐలయ్యపై కేసు పెట్టండి
కంచ ఐలయ్యపై కేసు నమోదుచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా పెద్ద గొల్లపల్లికి చెందిన వత్సల అనే మహిళ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రొఫెసర్ హోదాలో ఉన్న కంచె ఐలయ్య వివిధ కులాల మధ్య వైషమ్యాలను రేకెత్తిస్తున్నారని, తద్వారా హిందువుల మధ్య ఘర్షణలకు కారణమవుతున్నారని ఆరోపించారు. కంచె ఐలయ్య చేసిన ప్రసంగాలు, ప్రకటనలతో కూడిన ఫిర్యాదును కనిగిరి పోలీసులకు ఇచ్చినా, వారు కేసు నమోదు చేయలేదని ఆమె హైకోర్టు దృష్టికి తెచ్చారు.