రాష్ట్రీయం

రేపు కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ 66వ వార్షికోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: ఈనెల 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని సైనిక విభాగాలకు చెందిన కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ 66వ, వార్షికోత్సవాన్ని నిర్వహించబోతోంది. 1994 నవంబర్ ఒకటిన సికిందరాబాద్‌లో ఆవిర్భవించిన ఈ కార్యాలయం ఏప్రిల్ ఒకటి, 1995 నుంచి స్వతంత్ర కార్యాలయంగా పనిచేయడం ప్రారంభించింది. ఈ కార్యాలయం కింద 38 ఉప కార్యాలయాలున్నాయి. వీటిలో 700 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. విశాఖపట్నం, సూర్యలంక, ఎద్దుమైలారంతోపాటు హైదరాబాద్, సికిందరాబాద్‌లలో విస్తరించి ఉన్నాయి. దేశంలో పనిచేసే ఈఎంఈ, ఏఓసి విభాగాలకు చెందిన సైనికుల నెలవారీ జీత,్భత్యాలను వితరణ చేయడం, అకౌంట్లు, ఆడిట్, ఆర్థిక సలహాలు, రక్షణ శాఖకు సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలు పర్యవేక్షించడం ఈ కార్యాలయాల బాధ్యత. సిడిఏ సికిందరాబాద్ ప్రధాన కేంద్ర కార్యాలయంలో జరిగే 66వ, వార్షిక వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పత్రికా ప్రకటనలో కోరారు.