రాష్ట్రీయం

కారుపై పడిన మరో కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 2: రాజీవ్ రహదారి నెత్తురోడింది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఒక కుటుంబం మరణ శాసనానికి కారణమైంది. తాగిన మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న మరో కారుపై పడింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సినిమా పక్కీలో ఆదివారం అర్ధరాత్రి రాజీవ్ రహదారిపై జరిగిన ఈ ఘటన చూపరులను కలచివేయగా, ఒక కుటుంబం మృత్యు ఒడిలోకి వెళ్లింది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక కారు డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారుపై పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. బసంత్‌నగర్‌కు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇండికా విస్టాలో కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తుండగా, అందుగులపల్లి శివారులోని పెట్రోల్ బంక్ వద్ద రాజీవ్ రహదారి డివైడర్‌ను ఢీకొట్టాడు. అతి వేగంగా నడపడం వల్ల కారు ఎగిరిపోయి ఎదురుగా వస్తున్న వెర్నా కారుపై పడింది. ఈ సంఘటనలో కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ నుంచి వెర్నా కారులో కరీంనగర్ వైపు వస్తున్న ముస్లిం కుటుంబ సభ్యులలో అజీం (35), హర్షియా సుల్తానా (30), కూతురు మెహవిష్ (5), అరిఫా (2), అజీం మరుదలు హాప్రిన్ మృత్యువాత పడ్డారు. మృతుని సోదరుడు నజీర్‌తో పాటు ఏడేళ్ల పాప తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన సుదర్శన్ రెడ్డి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుదర్శన్ రెడ్డి అతిగా మద్యం సేవించి కారు అతి వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

చిత్రం..రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు