రాష్ట్రీయం

ఎన్నికల బరిలో దిగుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్న జనసేన బలాబలాలకు అనుగుణంగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 294 స్థానాలు ఉండగా, ఆంధ్రాలో 175, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి గట్టి పట్టు ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గాలను గుర్తించారు. ప్రతి నియోజకవర్గంలో మిగిలిన పార్టీలు బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోగా, జనసేన మాత్రం జిల్లా స్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియలో ఉంది. అయినా ప్రజలు కోరుకుంటే కమిటీలతో సంబంధం లేకుండా గెలిచే అవకాశాలు ఉంటాయనే సిద్ధాంతాన్ని పార్టీ నమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం 100 నుండి గరిష్టంగా 175 స్థానాలకు పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. రెండు రాష్ట్రాల్లో చెరో 50 నియోజకవర్గాల్లో బలపడినా, అధికారంలో ఉన్న ప్రభుత్వాలను నిలదీసే పరిస్థితి ఉంటుందని జనసేన భావిస్తోంది. ఖచ్చితంగా అన్ని సీట్లకూ పోటీచేస్తామని చెప్పి, అందుకు భిన్నంగా వ్యవహరించే బదులు ముందుగానే పార్టీ యంత్రాంగాన్ని కొన్ని సీట్లకే పోటీచేస్తామనే సందేశాన్ని ఇవ్వడం మంచిదనే యోచనలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉన్నట్టు తెలిసింది.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పార్టీకి దిశ-దశను ఇచ్చే యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని సమకూర్చుకున్న పవన్ కల్యాణ్ అనుబంధ కమిటీలపై దృష్టిసారించారు. ప్రధానంగా యువజన విభాగాలు, మహిళా విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి తర్వాత వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరో పక్క రెండు రాష్ట్రాల్లో కీలకమైన ప్రజా సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారంపై నిపుణులతో చర్చలు నిర్వహించడం తద్వారా వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ విధానాన్ని రూపొందించడంపై జనసేన దృష్టిసారించింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో ముందుకు సాగేందుకు కొద్ది మంది నిపుణులతో ఇప్పటికే పవన్‌కల్యాణ్ చర్చలు ప్రారంభించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ సమస్యలు, రైతాంగ సమస్యలు, కుల-మత సంబంధ అంశాలు, వివిధ సంక్షేమ పథకాలు, అంతర్జాతీయంగా వివిధ దేశాలతో మైత్రీబంధం వంటి అంశాలపై కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇంత వరకూ ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు, భవిష్యత్‌లో వాటిని సరిదిద్దడం వంటి అంశాలపై కూడా పవన్ దృష్టిసారించారు. మరో పక్క స్థానిక సమస్యలను గుర్తించడం, ప్రజల సహకారంతో పరిష్కరించడం, లేకుంటే వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఆయన చర్చిస్తున్నారు. ఎన్నికలు సమయం ఆసన్నం కావడంతో ప్రజల వద్దకు పార్టీ విధానాలతో చేరువయ్యే మార్గాలపై కూడా ఆయన అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.