రాష్ట్రీయం

ఆస్తుల పంపకాలపై వీడని చిక్కుముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంపై వత్తిడి తెస్తున్న ఎపి, తెలంగాణ సిఎంలు 73 కార్పొరేషన్ల హెడ్‌క్వార్టర్లపై రాని స్పష్టత

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 3: సమైక్యాంధ్ర విడిపోయి మూడేళ్ళు దాటింది. అయినా ప్రభుత్వ ఆస్తుల పంపకాలు మాత్రం ఇప్పటికీ జరగనేలేదు. దీనిపై వేసిన కమిటీలు నివేదికలు ఏమవుతున్నాయో తెలియడంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను పంచాల్సిందేనంటూ ఎపి ప్రభుత్వం కేంద్రానికి డిమాండ్ చేస్తుండగా, నిజాం కాలంనాటి ఆస్తులన్నీ తమకే చెందుతాయంటూ తెలంగాణా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేమీ పరిగణనలోకి తీసుకోని కేంద్రం మాత్రం హెడ్‌క్వార్టర్‌కు సంబంధించిన వరకే ఆస్తి పంపకాలు జరగాలని, దీని పరిధిలోకి వచ్చేవేమీ సొంత రాష్ట్రాలకు వెళ్ళవంటూ చెబుతోంది. అయితే దీనికి ఏకీభవించని ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు ఇపుడు ఆస్తుల పంపకాలు న్యాయబద్ధంగా ఉండాలని, వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలంటున్నాయి. అయితే వివాదస్పదంగా మారిన ఈ అంశంపై కేంద్రం ఎటూ తేల్చడంలేదు. మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాలు కమిటీలపై కమిటీలు వేస్తూ తాత్సారం చేస్తున్నాయి. దీనివల్ల అసలు ఎప్పటికీ ఆస్తుల పంపకాలు జరుగుతాయనే విషయంలో స్పష్టత రావడంలేదు. అయితే కేంద్రం చెప్పినట్టుగా కేంద్ర కార్యాలయాలు (హెడ్‌క్వార్టర్స్)కు సంబంధించి ఆస్తుల పంపకాలు జరిగితే తెలంగాణాకు చెందిన ఆస్తులన్నీ ఎక్కువశాతం వదులుకోవాల్సిందే. ఎందుకంటే కేంద్ర కార్యాలయం ఆస్తులతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీని పరిధిలోకి వచ్చే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉండే సంస్థల ఆస్తులన్నీ చేతులారా పోగొట్టుకోవాల్సిందే. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి 73 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో బేవరేజెస్, జిసిసి, అప్కాబ్, ఆర్టీసీ వంటివి సంస్థల కేంద్ర కార్యాలయాలన్నీ ఇంకా హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నాయి. అయితే వీటికి సంబందించి స్థిరాస్తులన్నీ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఉన్నాయి. అయితే తెలంగాణా పరిధిలోనే ఉన్న హైదరాబాద్‌లో కార్పొరేషన్ల కేంద్ర కార్యాలయాలకు చెందిన ఆస్తులన్నీ ఏపీకి ఏమాత్రం చెందవంటోంది. రాష్టవ్రిభజన చట్టంలో ఉన్న ప్రకారం నిర్దేశించిన నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకాలు జరగాల్సిందేనని, ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఆస్తులుగా పరిగణించి న్యాయం చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ విధంగా నెలకొన్న ఆస్తుల పంపకాలకు సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడంలేదు.
కమిటీల నివేదికలు ఏమైనట్టు?
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తుల పంపకాలపై నియమించిన కమిటీల నివేదికలు ఏమైనట్టు? అసలు ఈ కమిటీలు అధ్యయనాలు చేసి ప్రభుత్వానికి నివేదికల్లో ఏయే అంశాలు పొందుపర్చబడ్డాయి? కేంద్రానికి వెళ్ళిన నివేదికల్లో అసలు సారాంశం ఏమిటి? అనే అంశాలపై సందిగ్దత నెలకొంది. ఆస్తుల పంపకాలపై తొలుత అపెక్స్ కమిటీ, ఆ తరువాత షీలాబెడీ కమిటీలు నియమించారు. ఈ రెండు ఉద్యోగాల వివరాలను సేకరించి వీరందర్ని సొంత రాష్ట్రాలకు పంపేందుకు సిఫారసులు చేసాయి. ఇందులోభాగంగా కొన్ని కార్పొరేషన్ల ఉద్యోగాలు సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోగలిగారు. అయితే ఇందులో ముఖ్యమైన గిరిజన సహకార సంస్థ ఉద్యోగాలు ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు సర్ధుకున్నారు. తెలంగాణాకు చెందిన 30 మందికి పైగా ఉద్యోగులు ఏపీలోనే పనిచేశేవారు. ఇపుడు వీరంతా వారి సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అలాగే తెలంగాణాలో పనిచేసే కేవలం ఆరుగురు మాత్రం ఏపీకి వచ్చేశారు. ఉద్యోగాల వరకు సమస్య తీరినా జిసిసికి ఆస్తుల పంపకాలు మాత్రం ఇప్పటికీ జరగనేలేదు. జిసిసి ఒక్కటే కాకుండా 73 కార్పొరేషన్లకు సంబందించిన ఆస్తుల పంపకాల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఆర్టీసీ, బెవరేజీస్, జిసిసి వంటి అనేక సంస్థల ఆస్తుల పంపకాలు జరగకపోవడంతో వీటి యాజమాన్యాలు అయోమయంలో పడుతున్నాయి.