రాష్ట్రీయం

వ్యవసాయ రంగం వైపు యువతను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 4: వ్యవసాయం లాభసాటిగా లేదని నిరాశ, నిస్పృహలకు లోనైన రైతులు వేగంగా వ్యవసాయాన్ని వదిలివేస్తున్నారని, ఇతర వృత్తుల వారు ఆయా వృత్తుల్లో తమ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నరని, ఈ సంప్రదాయం వ్యవసాయం కూడా అనుసరిస్తూ యువతను వ్యవసాయంపై మక్కువ పెంచుకొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వాలు కూడా సహకరించాలని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాయలం 49వ స్నాతకోత్సవం నెల్లూరు నగరంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్టప్రతి పట్ట్భద్రులకు డిగ్రీ పట్టాలు, పిహెచ్‌డిలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 64 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, తద్వారా దేశ గ్రామీణ స్థూల ఉత్పత్తిని 39శాతం సాధించిందన్నారు. వ్యవసాయ అనుబంధరంగాలు దేశ జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధికి అధిక శాతం దోహదపడుతాయని అన్నారు. 2016-17 ఏడాదిలో 270.83టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. వరి, గోధుమ, చెరకు, వేరుశనగ, కూరగాయలు, ప్రత్తి, చేపలు తదితర ఆహారపదార్ధాల వృద్ధిలో ప్రపంచంలో రెండవస్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. దేశంలో ప్రతి ఏటా 3 శాతం మంది వ్యవసాయ వృత్తి నుండి వైదొలగడం ఆందోళనకరమన్నారు. వ్యవసాయ రంగంలో పట్ట్భద్రులైన వారు, శాస్తవ్రేత్తలు రైతులు అధిక దిగుబడి పొందేలా ఎప్పటికప్పడు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. దేశంలో ఏ రైతు కూడా వ్యవసాయంతో పాటు కోళ్ల, పశు తదితర అనుబంధ వ్యాపారాలతో అభివృద్ధి చెందుతున్న విషయం సర్వేల్లో వెల్లడైందన్నారు. 2022 నాటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవడంలో ముందంజలో ఉన్నాయని అభినందించారు. వ్యవసాయాభివృద్ధి విషయంలో రెండంచెల ప్రణాళికలు అవసరమని, మొదటగా నీటి వినియోగం, వౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడి బీమాలను నాలుగు కళ్లుగా భావించాలని, రెండో ప్రాధాన్యతగా ప్రయోగ ఫలితాలను ఎప్పటికప్పుడు వెంటనే రైతులకు చేరవేసే విధంగా ప్రణాళికలు వృద్ధి చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. నదుల అనుసంధానంతో వ్యవసాయాభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని, కృష్ణా, గోదావరి జలాలను కలపడం ద్వారా వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డులు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ మాట్లాడుతూ విద్య అనేది ధనార్జనకు సంబంధించిన వనరు కాదని ఒక సేవ అనే విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలలో నీటి వినియోగాన్ని నియంత్రించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ప్రయివేటు విద్యా సంస్థలు వాటి వ్యాపార ధోరణిని మార్చుకోవాలని, కాలానుగుణంగా ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలను అమలుపరుస్తూ సత్ఫలితాలు పొందాలని కోరారు. ఉప కులపతి దామోదర్‌నాయుడు మాట్లాడుతూ రైతు సర్వతోముఖాభివృద్ధికి ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, యూనివర్శిటీ రిజిస్ట్రార్ టి.వి.సత్యనారాయణ, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు పాల్గొన్నారు.