రాష్ట్రీయం

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను పరిశీలించిన కృష్ణా బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, అక్టోబర్ 4 : కృష్ణానది యాజమాన్యం బోర్డు అధికారులు బుధవారం పోత్తిరెడ్డిపాడు నుంచి ఎస్‌ఆర్‌ఎంసికి విడుదలవుతున్న కృష్ణా జలాలను, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పరిశీలించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నేరుగా ఎస్‌ఆర్‌ఎంసికి చేరుకున్న అధికారులు పాములపాడు మండలం ఇస్కాల వంతెన వద్ద ఏర్పాటుచేసిన టెలిమెట్రీని సాంకేతికంగా పరిశీలించారు. ఈ టెలిమెట్రీ నుంచి క్యాంపరింగ్ జరుగలేదని ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని కృష్ణాజలాల యాజమాన్యం బోర్డు ఇఇ రవీంద్రర్, ఏడిఇ అశోక్, నాగార్జున సాగర్ డిఇఇ అధికారులు స్పష్టం చేశారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి 125వ కి.మీ వద్ద కృష్ణాజలాల ప్రవాహాన్ని అంత్యంత ఆధునిక పరికరాలతో తనిఖీ చేశారు. నీటి ప్రవాహాన్ని, వేగం లోతును, కాలువ వెడల్పును నిషితంగా పరిశీలించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపి నీటి వాటా విడుదలను నిలిపివేయాలని ఆదేశించారు. అయితే రాయలసీమలోని తాగునీటి ప్రాజెక్టుల నీటి అవసరాలను బట్టి రెండు రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.