రాష్ట్రీయం

రొట్టెల పండుగకు జనసందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 4: నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగకు బుధవారం లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈనెల ఒకటి నుండి ప్రారంభమైన ఈ గంధ మహోత్సవానికి ఇప్పటిదాకా సుమారు ఎనిమిది లక్షల మంది వరకూ భక్తులు హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాల్గవ రోజైన బుధవారం రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఈ పండుగకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. సినీ నటుడు అలీ కూడా ఈ పండగకు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి కార్యక్రమానికి హాజరై రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కాంక్షిస్తూ రొట్టెను స్వీకరించారు. అలాగే మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ కుటుంబ సమేతంగా హాజరై రొట్టెలు అందుకున్నారు. స్థానిక ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రొట్టెను స్వీకరించగా, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్యనిషేధం కోరుతూ ఓ యాత్రికురాలి నుండి రొట్టెను స్వీకరించడం విశేషం. శ్రీకాకుళం ఎంపి కింజారపు రామ్మోహన్‌నాయుడు, నెల్లూరు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు అలీ దర్గాను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు. గంధ మహోత్సవం గురువారంతో ముగియనుండడంతో బుధవారం ఉదయం నుండే నెల్లూరుకు ఇతర ప్రాంతాల నుండి యాత్రికుల రాక ఎక్కువైంది. బుధవారం ఒక్కరోజే సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. గురువారం మరో 2 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి అధికమవుతుందనే అంచనాల నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం నెల్లూరుకు రావడంతో ఓ వైపు రొట్టెల పండగ తాకిడి, మరోవైపు వి ఐపిల రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపరాష్టప్రతి పాల్గొనే కార్యక్రమం ఏర్పాటు చేసిన సభాస్థలి దర్గాకు సమీపంలో ఉండడంతో యాత్రికులను వేరే మార్గం ద్వారా దర్గా వద్దకు పోలీసులు పంపే ఏర్పాట్లు చేశారు.