రాష్ట్రీయం

నీటి పంపకంపై త్వరలో భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 191 టిఎంసికి చేరుకోవడంతో, ఈ నీటిని వచ్చే వేసవి వరకు పంచుకునే విషయమై రెండు రాష్ట్రాల సాగు నీటిపారుదల శాఖ మంత్రుల స్థాయి సమావేశం జరగనుంది. ఈ నెల 15వ తేదీన కృష్ణాబోర్డు సమావేశం జరగక ముందే మంత్రుల స్థాయిలో సమావేశం జరిగితే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు కృష్ణాబోర్డు సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు నీటి వివాదాలకు కారణమయ్యే అంశాలు, ఇంతవరకు వినియోగించుకున్న నీటి పరిణామం, ప్రస్తుతం లభ్యతలో ఉన్న నీరు, ప్రాధాన్యతలపై నివేదికలు తయారు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలంలో 854 అడుగులు, నాగార్జునసాగర్‌లో 510 అడగులకు తగ్గకుండా నీటి మట్టాలు పరిరక్షించాలని కృష్ణాబోర్డు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో శ్రీశైలంలో 854 అడుగులకు పైన 50 నుంచి 60 టిఎంసి నీటి లభ్యత ఉంటుంది. అలాగే నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు 517 అడుగుల వరకు అంటే 144 టిఎంసి నీటి నిల్వ ఉంది. ఇక్కడ 20 టిఎంసి నీటి లభ్యత ఉంది. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 834 అడుగులు ఉంటే సరిపోతుందని భావిస్తే 113 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 133 టిఎంసి నీరు అందుబాటులోకి వస్తుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనావేశారు.
ఇప్పటికే పోతిరెడ్డి పాడుపై తెలంగాణ ప్రభుత్వం, జూరాల ద్వారా ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాల్సి ఉండగా, వరి పంటకు సాగునీటిని ఎక్కువగా మళ్లించారని రెండు రాష్ట్రాలు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని కృష్ణాబోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం శ్రీశైలంకు 92వేల క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 8వేల క్యూసెక్కులు, జూరాలకు 65వేల క్యూసెక్కులు, ఉజ్జయిని (మహారాష్ట్ర)ప్రాజెక్టుకు 4200 క్యూసెక్కులు, ఆల్మట్టి (కర్నాటక)కు 35వేల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్ (కర్నాటక)కు 41వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.
తెలంగాణ జలాశయాల్లో జల కళ
తెలంగాణలోని సింగూరు జలాశయంలో 29.91 గాను టిఎంసికి 29.05 టిఎంసి, శ్రీరాంసాగర్‌లో 90.31 టిఎంసికి 37 టిఎంసి, లోయర్ మానేరు డ్యాంలో 24 టిఎంసికి 7.17 టిఎంసి, కడెం జలాశయంలో 7.60 టిఎంసికి 6.66 టిఎంసి, శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో 20.18 టిఎంసికి 19.64 టిఎంసి, జూరాలలో 9.66 టిఎంసికి 9.30 టిఎంసి నీరు చేరడంతో ఈ ఏడాది మంచి నీటి కష్టాలు దాదాపు తీరినట్లేనని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. జంటనగరాలకు మంచినీటిని సరఫరా చేసే ఉస్మాన్ సాగర్‌లో 3.900 టిఎంసికి 2.151 టిఎంసి, హిమాయత్ సాగర్‌లో 2.967 టిఎంసికి 0.757 టిఎంసి నీరు లభ్యతలో ఉంది.