రాష్ట్రీయం

చట్టపరిధిలోనే రామ మందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: అయోధ్యలో రామమందిర నిర్మాణం చట్టపరిధిలోనే జరపాలన్నది తమ ఉద్దేశమని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణం త్వరగా జరగాలన్న ఉద్దేశంతో అయోద్యలో అక్టోబర్ 5 నుండి 15 వరకు శతకోటి రామనామ జప మహాయజ్ఞం చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా నాలుగువేదాల హవనం ఉంటుందని, హనుమాన్ పూజలు, చండీయాగం, సుదర్శన యజ్ఞం ఉంటాయన్నారు. భారతదేశంలోని సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. వివిధ పీఠాధిపతుల ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశ్వప్రసాద శర్మ నేతృత్వంలోని ప్రవాస భారతీయులు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు.
హిందూ ధర్మ ప్రతిష్టాపనే తన లక్ష్యమని, అందుకే కాషాయం తీసుకున్నానని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల రామమందిర నిర్మాణం వాయిదా పడుతూ వస్తోందన్నారు. కోర్టు వెలుపల చర్చల ద్వారా రామమందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీం కోర్టు చేసిన సూచన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు తీర్పుకు లోబడే రామమందిర నిర్మాణం జరగాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే మళ్లీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశామని గుర్తు చేశారు. అయోధ్య రామమందిరంపైనే బాబ్రీ మసీదు నిర్మించారనేందుకు పురాతత్వ శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయన్నారు.
రామమందిర నిర్మాణానికి ప్రస్తుతం నిర్వహించే మహాయజ్ఞం బలాన్ని సమకూరుస్తుందని నమ్ముతున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అక్టోబర్ 5 నుండి 15 వరకు హనుమాన్ విగ్రహానికి దీపారాధన చేసి పూజలు నిర్వహించాలని, తద్వారా ఆధ్యాత్మికంగా ఒక బలం చేకూరుతుందని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. రామమందిరం అనేది ఒక గుడి కాదని, అది హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. రామనామ యజ్ఞం వివాదం కాబోదని, అది శాంతికి చిహ్నంగా ఉంటుందని పరిపూర్ణానంద పేర్కొన్నారు.
హిందూమతంపై ఇతర మతాలు దాడులు చేస్తున్నాయని, చివరకు తిరుమలను కూడా క్రైస్తవ మత ప్రచార కేంద్రంగా మార్చుకోవాలని ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.