రాష్ట్రీయం

హైదరాబాద్‌లో ప్రతి ఏటా 2400 తాజా క్యాన్సర్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: పాపులేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో 2400 తాజా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు అమెరికా ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ పేర్కొంది. బుధవారం ఇక్కడ మహిళల్లో కేన్సర్‌పై అవగాహన కల్పించే కార్యక్రమానికి ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, సీనియర్ కనె్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ ఎం బాబయ్య, కనె్సల్టెంట్ ఆంకాలజీ చీఫ్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ ఫమీదా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా ఆంకాలజి ఇనిస్టిట్యూట్ క్యాన్సర్‌పై గణాంక వివరాలను విడుదల చేసింది. భారతదేశంలో ప్రతి రోజూ రెండు వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 1200 కేసులు వ్యాధి ముదిరిన దశల్లో ఉన్నాయి. లక్షకు 110 ఉన్న కేన్సర్ రోగులు 2025 నాటికి లక్షకు 190 నుంచి 260కు అంటే 0.7 మిలియన్లకు చేరుకుంటారు. రొమ్ము క్యాన్సర్ అధికంగా ఉంటే, గర్భాశయ క్యాన్సర్ తర్వాత స్ధానంలో ఉంది. ఇతర నివేదికల ప్రకారం హైదరాబాద్ నగరంలోని 35-65 సంవత్సరాల మధ్య ప్రతి వెయ్యి మంది మహిళల్లో కనీసం ఒక మహిళ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ, ఆ వ్యాధి గురించి వారికి ఏమీ తెలియదు. రాష్ట్ర స్ధాయిలో గర్భాశయ రొమ్ము క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైనదిగా గుర్తింపు పొందంది. రెండు రాష్ట్రాల్లో రెండు వేల గర్భాశయ క్యాన్సర్ కేసులు వ్యాధి బాగా ముదిరి చికిత్స అందించడం కష్టం, ఖరీదు అయిన దశలో నమోదు అయ్యాయి. గర్భాశయ, అండాశయ, యోని క్యాన్సర్లు మహిళల్లో అత్యంత సాధారణంగా వచ్చే క్యాన్సర్లు. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అత్యంత అధికంగా వచ్చేది, ప్రాణాంతకమైందని అమెరికా ఆంకాలజి ఇనిస్టిట్యూట్ పేర్కొంది. ప్రారంభ దశలో రొమ్ము, గర్భాశయం వంటి క్యాన్సర్‌లను గుర్తించి చికిత్స అందిస్తే నివారణ సాధ్యమవుతుంది. మన దేశంలో మహిళల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే పరీక్షల కోసం ముందుకు వస్తున్నారు. రొటీన్ పాప్ స్మియర్ పరీక్ష గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఉత్తమ మార్గంగా నిలిచిందని డాక్టర్ బాబయ్య చెప్పారు. 40-45 సంవత్సరాల వయస్సు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు సంవత్సరానికి ఒకసారి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.