రాష్ట్రీయం

మార్చినాటికి 5లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 5: రాష్ట్రంలో వచ్చే మార్చి నాటికి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద 5లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్.. గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి (సిఎస్) మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మార్చిలోగా 5లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. కొన్ని జిల్లాల్లో లక్ష్యాలకు
అనుగుణంగా ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంపై సిఎస్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 6వేల 883 ఇళ్లు పూర్తికావాల్సి ఉండటంతో ఆ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌తో సిఎస్ దినేష్‌కుమార్ ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన వాటిని పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నిటికీ జియో ట్యాగింగ్ పూర్తిచేసి గృహ నిర్మాణ లబ్ధిదారులకు 7 దశల్లో బిల్లులు చెల్లించే ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. లేబర్ కాంపొనెంట్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా నిధులు వస్తున్నందున, ఉపాధి హామీ కింద గృహ నిర్మాణ పథకంలో లేబర్ కాంపొనెంట్ కింద చెల్లించాల్సిన సొమ్మును లబ్ధిదారులకు పనిచేసిన 15 రోజుల్లోగా చెల్లించాలన్నారు. ఈ విషయంలో జాప్యం చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ (హుద్‌హుద్ సైక్లోన్) కింద విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 252 కోట్లతో మంజూరు చేసిన 9వేల 170 గృహాలను నవంబరు నెలాఖరులోగా పూర్తిచేయాలని సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ మల్లికార్జునరావు, ఆ శాఖ జిఎంలు భాస్కర్, సాయినాధ్, ఇఇలు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్