రాష్ట్రీయం

చకచకా భూ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే కార్యక్రమం వేగవంతమైంది. రాష్ట్రంలోని 10875 గ్రామాలకు 1219 గ్రామాల్లో 80 శాతం భూముల్లో సర్వే గుర్తింపు, తనిఖీ పనులు దాదాపు పూర్తయ్యాయి. మూడు నెలల పాటు కొనసాగనున్న భూసర్వే కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించిన సంగతి విదితమే. భూ తగదాలు, వివాదాల నిర్మూలనకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వే పనులకు విశేష స్పందన లభిస్తోంది. నిర్దేశించిన విధంగానే ఈ ప్రాజెక్టు పనులు చకాచకా సాగుతున్నాయని, రైతులు, ప్రజల నుంచి పూర్తి సహకారం లభిస్తోందని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టిన 20 రోజుల్లోనే 1219 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల తనిఖీ పూర్తయింది. వచ్చే రెండు రోజుల్లో మరో రెండు వందల గ్రామాల్లో సర్వే రికార్డుల
తనిఖీ పూర్తవుతుంది. వంద రోజుల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టుకు సంబందించి పూర్తి అప్‌డేట్‌గా రెవెన్యూ రికార్డులు వచ్చే జనవరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.
గత 20 రోజుల్లో ప్రత్యేక బృందాలు 11.38 లక్షల సర్వే నంబర్ల భూములను సందర్శించాయి. 14.19 లక్షల రికార్డులను తనిఖీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 2.45 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇంతవరకు 30.04 లక్షల ఎకరాల మేర సర్వే పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 1406 బృందాలు 1.78 కోట్ల సర్వే నంబర్లను తనిఖీ చేయాల్సి ఉంది. ఇంతవరకు 23.96 లక్షల ఎకరాల భూమి లిటిగేషన్‌కు అతీతంగా ఉందని అధికారులు తేల్చారు. అంటే ఇంతవరకు తనిఖీ చేసిన భూముల్లో 81 శాతం లిటిగేషన్‌కు అతీతంగా ఉన్నట్లు నిర్ధారించడం ద్వారా రైతులు, ప్రజలకు ఉపశమనం కలిగించినట్లయింది. దేశంలో మొదటిసారిగా 20 రోజుల్లో 30 లక్షల ఎకరాల సర్వే చేయడం ప్రథమమని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి.
తనిఖీ సమయంలో రెవెన్యూ బృందాలు ముందుగా భూమి యజమానులకు ఫారం 1బి అందిస్తారు. ఇందులో భూకమతాల వివరాలు ఉంటాయి. అనంతరం ఇవి సరిగా ఉన్నాయని రైతులు సంతకాలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఈ వివరాలను కంప్యూటీకరణ చేస్తారు. కొన్ని చోట్ల రైతులు ఇచ్చిన అభ్యంతరాలు, సలహాలను కూడా రెవెన్యూ శాఖ స్వీకరించింది. రెవెన్యూ బృందాలు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి భూకమతాల వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే రెండవ దశలో సరిదిద్దేందుకు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంది.