రాష్ట్రీయం

సింగరేణి ఎన్నికల్లో గుబాళించిన ‘గులాబీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం కోసం గురువారం జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయ బావుటా ఎగురవేసింది. ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలు, 12 శాసన నియోజక వర్గాల పరిధిలో విస్తరించిన సింగరేణికి చెందిన 52,534 మంది కార్మికులు పాల్గొనే ఈ ఎన్నికలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరాండంగా, భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు ధికుస్సూచిగా పాలక, ప్రతిపక్ష పార్టీలు భావించాయి. పైగా టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి ముఖ్యమంత్రి కూతురు, నిజామాబాద్ ఎంపి కవిత స్వయంగా గౌరవాధ్యక్షురాలిగా ఉండటంతో ఈ ఎన్నికలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాకరంగా తీసుకున్నారు. టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘంతో తలపడటానికి విపక్షాలన్నీ ఏకమై కూటమి కట్టినా గులాభి ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. సిపిఐ అనుబంధ
కార్మిక సంఘం ఎఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి, టిడిపి కార్మిక సంఘం టిఎన్‌టియుసి మూడు సంఘాలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో తలపడినా అధికార కార్మిక సంఘాన్ని ఎదుర్కొలేకపోవడం గమనర్హం. ఈ ఎన్నికల్లో మొత్తం 16 కార్మిక సంఘాలు బరిలో నిలిచినప్పటికీ ప్రధాన పోటీ ప్రస్తుత గుర్తింపుకార్మిక సంఘం టిబిజికెఎస్‌కు (టిఆర్‌ఎస్ అనుబంధం), ఎఐటియుసి నేతృత్వంలోని కూటమికి మధ్యననే ప్రధాన పోటీ జరిగింది. డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలకు కోర్టు బ్రేక్ వేయడంతో దీనినే ప్రధాన ఎన్నికల అస్త్రంగా టిబిజికెఎస్ వ్యతిరేక ఎఐటియుసి కూటమి ఎంచుకుంది. కోర్టు బ్రేక్ వేసినా డిపెండెంట్‌లకు కారుణ్య నియామకాల రూపంలో ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రధాన హామీతో పాటు సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలు విపక్ష కార్మిక సంఘాల కూటమిని కంగుతినిపించింది. ఏ హామీ నెరవేర్చాలన్నా అది ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వానికే సాధ్యమవుతుందన్న వాస్తవిక పరిస్థితికి కార్మికులు మొగ్గు చూపడంతో ప్రతిష్టాకర సింగరేణి ఎన్నికలు టిఆర్‌ఎస్ విజయం నల్లేరు మీద నడకగా మారి విజయ దుందుభి మోగించింది. కొత్తగూడెం కార్పొరేట్, సింగరేణి కార్యాలయం (హైదరాబాద్), ఇల్లందు, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌లలో టిబిజికెఎస్ విజయం సాధించగా, భూపాలపల్లిలో మాత్రమే ఎఐటియుసి ఆధిక్యతను సాధించినట్టు రాత్రి పొద్దుపోయే వరకు అందిన సమాచారం. మొత్తం 11 డివిజన్లకుగాను 8 డివిజన్లలో టిబిజికెఎస్ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది.
సింగరేణి ఎన్నికల ఫలితాలు ఇలా వున్నాయ
సంవత్సరం యూనియన్ మెజార్టీ
1998 ఏఐటియుసి 31,938
2001 ఏఐటియుసి 21,599
2003 ఐఎన్‌టియుసి 30,291
2007 ఏఐటియుసి 30,385
2012 టిబిజికెఎస్ 23,311
2017 టిబిజికెఎస్ గెలుపు

చిత్రం..కొత్తగూడెంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిజిబికెఎస్) విజయోత్సవం