రాష్ట్రీయం

షేక్‌లకు ‘పిడి’ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: హైదరాబాద్ పాతబస్తీలో ఎట్టకేలకు కాంట్రాక్టు పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బార్కస్, సలార్ తదితర ప్రాంతాల్లో రోజూ ఎక్కడో ఓ చోట కాంట్రాక్టు పెళ్లి జరిగేది. కాంట్రాక్టు పెళ్లిళ్లు కుదర్చుతున్న బ్రోకర్లు, పెళ్లిళ్లు నిర్వహిస్తున్న ఖాజీలు, వీరికి ఆశ్రయం కల్పిస్తున్న లాడ్జీల యజమానులు కొందరిపై పీడీ యాక్టు పెట్టడంతో పాతనగరం ఒక్కసారిగా ఉలికిపడింది. దీంతో ఏజెంట్లు, బ్రోకర్లు, అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. గల్ఫ్ దేశాల నుంచి అరబ్బులను హైదరాబాద్‌కు రావద్దంటూ ఏజెంట్లు ఒమన్, సౌదీ అరేబియా, దుబాయి, కువైట్ దేశాల
అరబ్బులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా సౌత్‌జోన్ పోలీసులు పలువురు ఖాజీలతోపాటు బ్రోకర్లపై రౌడీషీట్ తెరవడం పాతబస్తీలో సంచలనంగా మారింది. కాంట్రాక్టు పెళ్లిళ్లను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావడంతో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అరబ్బులకు ఆశ్రయం కల్పిస్తున్న లాడ్జీలు, ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌ల యజమానులను పోలీసు ఉన్నతాధికారులు గట్టిగా హెచ్చరించడంతో అక్రమ పెళ్ళిళ్లకు సహకరించమని, లాడ్జీలు అద్దెకు ఇవ్వమని యజమానులు స్పష్టం చేశారు. కాగా ఇటీవల అక్రమ పెళ్లిళ్లకు సహకరించిన ముగ్గురు మహిళా ఏజెంట్లపై పీడీ యాక్టు ప్రయోగించడంతో మిగతా వారిలో గుబులు మొదలైంది. పోలీస్ జాబితాలో నగరవ్యాప్తంగా 35 మంది ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాతబస్తీ, నగరశివారుల్లో నిఘా పెంచారు.
..పేదరికమే కారణమా?
హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా ఏళ్లతరబడి కాంట్రాక్టు పెళ్లిళ్లు సాగుతున్నాయి. అరబ్బు షేకులకు మైనార్టీ తీరని అమ్మాయిలను అంటగట్టడం పేరికమా? ఏజెంట్ల ప్రోద్భలమా? అనే మీమాంస పాతబస్తీవాసులను వెంటాడుతోంది. అయితే పేదరికం నుంచి బయటపడాలనే ఆలోచనతో అధికశాతం ఆడపిల్లల తల్లిదండ్రులే ఈ పెళ్లిళ్లకు అంగీకరిస్తున్నారని బ్రోకర్లు చెబుతున్నారు. ఏజెంట్లు, ఖాజీలకు ఇది లాభసాటిగా మారడంతో కాంట్రాక్టు పెళ్ళిళ్లు యదేఛ్ఛగా జరుగుతున్నాయని కొందరు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కాగా గత నెల 20,26 తేదీల్లో కాంట్రాక్టు పెళ్లిళ్లకు సహాయపడుతున్న ఏజెంట్లు, అరబ్‌షేక్‌లతో సహా ముంబయి చీఫ్ ఖాజీ ఫరీద్ అహ్మద్ ఖాన్, పాతబస్తీ ఖాజీ అబ్దుల్లా రిఫాయి అలియాస్ ఓల్టా ఖాజీలను సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. కాంట్రాక్టు పెళ్ళిళ్ల విషయమై మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న పలువురు ఏజెంట్లు, ఖాజీలను విచారించగా..తాము బాలికల తల్లిదండ్రుల అనుమతితోనే పెళ్లిళ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అరబ్బు షేకులు ఇచ్చే డబ్బుతో పేద కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే తాము కాంట్రాక్టు పెళ్ళిళ్లకు సహకరిస్తున్నామని ఓ ఖాజీ పోలీసులకు వివరించినట్టు తెలిసింది. ఇదిలావుండగా ముంబయి చీఫ్ ఖాజీ ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరిపించినట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో నాలుగు నుంచి ఐదు వందల వివాహాలు కాంట్రాక్టు పెళ్లిళ్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబయిలోని అతడి కార్యాలయంలో రికార్డులు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఏదీఏమైనా పాతబస్తీలో జరుగుతున్న కాంట్రాక్టు పెళ్ళిళ్లకు పూర్తి స్థాయిలో బ్రేక్ వేసేందుకు కృషి సల్పుతున్న సౌత్ జోన్ పోలీసుల కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు. బాల్యవివాహాలను రూపుమాపాల్సిందేనని కోరుతున్నారు.