రాష్ట్రీయం

పన్ను ఎగవేసే విధానం పోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: సమాజంలో పన్ను ఎగవేసే విధానం పోవాలని, ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించే అంశంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ‘జిఎస్‌టి ధర గుర్తింపు’ తెలుగు విభాగం మొబైల్ యాప్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ప్రారంభిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి బాధ్యతలతో పాటు హక్కులు ఉంటాయన్నారు. జిఎస్‌టి రేట్ ఫైండర్ యాప్ వల్ల పూర్తి వివరాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. చాలా మంది పన్ను ఏ విధంగా ఎగగొట్టాలా అన్న ఆలోచనతోనే ఉంటారని, ఇది తప్పుడు ఆలోచన అన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాలు సజావుగా నడవాలంటే అవసరమైన నిధులు కావాలన్నారు. ప్రభుత్వానికి అవసరమైన నిధుల సేకరణలో పన్నులదే కీలకమైన భూమిక అన్నారు. అందుకే సామాన్య ప్రజలతో పాటు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు జిఎస్‌టిని సక్రమంగా చెల్లించాలన్నారు. ఇప్పటి వరకు అనేక రకాలైన పన్నుల విధానం అమల్లో ఉండేదని, ఇప్పుడు అన్ని పన్నుల స్థానంలో జిఎస్‌టి ఒక్కటే అమల్లోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్‌టివల్ల మన దేశానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చిందన్నారు.

చిత్రం.. గురువారం రాజ్‌భవన్‌లో ‘జిఎస్‌టి ధర గుర్తింపు’ తెలుగు విభాగం మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్న గవర్నర్ నరసింహన్