రాష్ట్రీయం

దావోస్.. సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు దావోస్ పర్యటన సత్ఫలితాలిస్తోంది. అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉత్సాహాన్ని చూపించడం రాష్ట్ర బృందానికి మంచి ఊపునిస్తోంది. సిఎం చంద్రబాబు రాష్ట్రం కోసం వినత్న రీతిలో ప్రచారం చేయడం కూడా సత్ఫలితాలిస్తోంది. మియర్ బర్గర్ కంపెనీ ముందుకొచ్చి సోలార్ ప్యానల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేసింది, బిహెచ్‌ఎం పార్ట్‌నర్స్ గ్రూప్, ప్లిసమ్ టీమ్ గ్రూప్ సైతం పరిశ్రమల ఏర్పాటుపై ఆసక్తి చూపింది. ఆంధ్రప్రదేశ్‌లో 200 మిలియన్ డాలర్ల వ్యయంతో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. న్యూసెచ్ కంపెనీ, బికెడబ్ల్యు ఇంజనీరింగ్ కంపెనీ, ఘెర్జీ, సీస్, ఇండానీ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు పరిశ్రమల ఏర్పాటుపై తమ అభిప్రాయాలను చెప్పారు. ఏపీలో 2వేల కోట్ల రూపాయిలతో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు ఘెర్జీ ఆసక్తిని కనబరిచింది. పర్యావరణ హితంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో పేరుగాంచిన వెర్డి ఇంటర్నేషనల్ ప్రతినిధులు సైతం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రెండో రోజు పలు కంపెనీలు ముందుకొచ్చి తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశాయి. ఏపీలో బంగారం తవ్వకానికి సైతం గ్లోబల్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకోసం అవసరమైతే 300 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడతామని సంస్థ ప్రకటించింది. ప్లీనమ్ సైతం 200 మిలియన్లు పెట్టుబడికి ఆసక్తి కనబరిచింది. ఫండ్ మేనేజిమెంట్‌లో ప్రసిద్ధి చెందిన జీహెచ్‌ఎం ఫార్చ్యునర్స్ గ్రూప్‌తో చంద్రబాబు సమావేశం మంచి ఫలితానే్న ఇచ్చింది. బికెడబ్ల్యు హైడ్రో పవర్ ఉత్పత్తిపై దృష్టిపెట్టింది. పనిలో పనిగా బుధవారం మధ్యాహ్నం అర్బన్ డెవలప్‌మెంట్ భవిష్యత్ సేవలు అనే అంశంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. ఎ న్యూ క్లైమెట్ ఫర్ డూయింగ్ బిజినెస్ అనే అంశంపై చంద్రబాబు దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో మాట్లాడారు. అనంతరం చంద్రబాబు ఇండియా అండ్ ద అదర్ వరల్డ్ అనే అంశంపై చర్చించారు. ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తోనూ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరస్పర సహాయ సహకారాలపై సమగ్ర అధ్యయనానికి కేంబ్రిడ్జి వర్శిటీ నుండి 18మంది విద్యార్ధులు రాష్ట్రానికి వస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, ఆర్ధిక మంత్రి రవి కరుణనాయకే, బెల్జియం ప్రినె్సస్‌తో సిఎం భేటీ అయ్యారు. శ్రీలంక ప్రధాని ఆహ్వానం మేరకు సిఎం బుధవారం రాత్రి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నెస్లే కంపెనీ సిఇఓ పౌల్ బుల్క్‌తో సమావేశం అయ్యారు.