రాష్ట్రీయం

..సిగ్గుతెచ్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: సింగరేణి ఎన్నికల ఫలితాలతోనైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు హితవు పలికారు. ప్రజలు ప్రతీ ఎన్నికల్లోనూ బుద్ధిచెబుతున్నా ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కావడం లేదని ఆక్షేపించారు. సింగరేణిలో అన్ని సంఘాలు, పార్టీలు ఏకమైనా తమను ఎదుర్కోలేకపోయాయని, చరిత్రలో మనె్నన్నడూ లేనివిధంగా 45శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించామని అన్నారు. సింగరేణి ఫలితాల నేపథ్యంలో ప్రగతి భవన్‌లో శుక్రవారం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు ఏ ఎజెండా ఎంచుకోవాలో కూడా అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. సింగరేణి ఎన్నికలకు ముందు పార్టీ అధినేతగా తాను ఇచ్చిన ప్రతీ హామీని
తుచ తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. తెరాసకు తామే ప్రత్యామ్నాయమని ఊదరగొడుతున్న బిజెపికి సింగరేణి ఎన్నికల్లో 246 ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తూ, వీళ్లా మాకు ప్రత్యామ్నాయం అని ఎద్దేవా చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలను పొగొట్టిన వారే తమపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా సింగరేణి కార్మికులు తమనే నమ్మారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సింగరేణికి మరింత ఉజ్వల భవిష్యత్ కలిగేలా తీర్చిదిద్దుతామని అన్నారు. మరికొన్ని కొత్త అండర్‌గ్రౌండ్ మైన్స్‌ను త్వరలో తానే ప్రారంభిస్తానన్నారు. బయ్యారం గనులను సింగరేణికి అప్పగిస్తామని, ఆర్టీసీలో మాదిరిగా సింగరేణి కార్మికులకూ యాజమాన్యంలో భాగస్వామ్యం చేయడానికి రెండు మూడు డైరెక్టర్ పదవులు ఇచ్చేలా చట్టంలో మార్పు తెస్తామన్నారు. గతంలో కూడా తమ కార్మిక సంఘమే సింగరేణిలో విజయం సాధించినప్పటికీ, ఆ టీమ్ సరిగ్గా పని చేయకుండా కొట్టుకుచచ్చారన్నారు. ఇకముందు నెలకు రెండు గంటలపాటు తానే స్వయంగా సింగరేణి కార్యకలాపాలను సమీక్షించడానికి టైమ్ కేటాయిస్తామన్నారు. ప్రతి డివిజన్‌కు తమ కార్మిక సంఘం నుంచి ఎవర్ని పెట్టాలో తానే నియామకం చేస్తానన్నారు. భూ సర్వే నిర్వహించి నిజమైన, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.8 వేలు ఇస్తామంటే కూడా కడుపుమంట ఎందుకని సిఎం ప్రశ్నించారు. ప్రాజెక్టులు కడితే వ్యతిరేకం, గొర్రెలు పంపిణీ చేస్తే వ్యతిరేకం చివరకు మహిళలకు చీరలు ఇస్తే కూడా తప్పుపడతారా? అని నిలదీస్తూ, రాజకీయాల్లో ఇంత అసహనం పనికిరాదని విపక్షాలకు హితవు పలికారు. తాము అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు తమకే పట్టంగట్టినా, ప్రతిపక్షాలకు బుద్ధిరావడం లేదన్నారు. భూ సర్వే జరుగుతుంటే ఏదో జరిగిపోతుందని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని గవర్నర్ వద్దకు అఖిలపక్షం వెళ్లి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. వాళ్లు చెప్పేదాంట్లో వాస్తవం ఏమైనా ఉందా? అని గవర్నరే స్వయంగా జిల్లాలకు వెళ్లి భూ సర్వేను పరిశీలించి వచ్చి మంచి పని చేస్తున్నారని తనను అభినందించారని చెప్పారు. వీళ్ల ముఖాలకు రైతులకు ఏమైనా చేయాలన్న ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండని శాసనసభ సాక్షిగా అన్నప్పుడు, అప్పుడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలో ఎవరైనా నోరు విప్పారా? చీము, నెత్తురు లేకుండా వ్యవహరించిన వీళ్లా తమను విమర్శించేది అని నిప్పులు చెరిగారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో జానారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణకు అన్యాయం జరిగిందని దుకాణం పెడితే, ఈ ముఖాలేనా తెలంగాణ గురించి పోరాటం చేసేదని జానారెడ్డిని ముఖం పట్టుకుని నిలదీశానని సిఎం గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సిఎం దామోదరం రాజనరసింహ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చారన్నారు. రైతుల పేరిట కేసు వేసింది ఆయనేనని, రోజుకు ఆరు లక్షలు అడ్వకేట్‌కు ఫీజు చెల్లించే స్థోమతు రైతులకు ఉంటుందా? అని నిలదీశారు.

చిత్రం..మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కెసిఆర్