రాష్ట్రీయం

కన్నడ, తమిళం, హిందీ భాషల్లో టిటిడి వెబ్ సైట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 6: దేశంలోని శ్రీవారి భక్తులు టిటిడి వెబ్‌సైట్‌ను సులభంగా వినియోగించుకునేందుకు వీలుగా దశలవారీగా కన్నడం, తమిళం, హిందీ భాషల్లో వెబ్‌సైట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఇఓ కార్యక్రమం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే టిటిడి తెలుగు వర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. గోవింద మొబైల్ యాప్‌లో ఇప్పటికే టిటిడి ఆర్జిత సేవా టికెట్లు, వసతి బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదనంగా ఈ యాప్‌లో టిటిడి సమాచారాన్ని త్వరలోనే పొందుపరుస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంచి సుందరీకరణ పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నెల చివరి వారం నుంచే ఢిల్లీ, ముంబై, చెన్నయ్, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో టిటిడి సమాచార కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఇఓ చెప్పారు. ఈ నెల 17, 24 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు వెయ్యిమందికి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల మందికి, మధ్యాహ్నం 3 గంటలకు మరో వెయ్యిమందికి మొత్తం 4వేల మందికి దర్శనం టోకెన్లు జారీ చేశామన్నారు. 18, 25 తేదీల్లో ఐదు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 2వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. కాగా ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఎందుకు అన్న విషయమై భక్తులనుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్నారు.