రాష్ట్రీయం

పిఎస్‌ఎల్‌వి-సి31 జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపగ్రహ ఉపయోగాలు
నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది.
రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్సుపాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి.
ఈ సాంకేతిక పరికరాలన్ని భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి.

నెల్లూరు/సూళ్లూరుపేట, జనవరి 20: అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణపతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రోదసీ పరిశోధనలో ఇండియా మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని అధిక మించి అగ్రరాజ్యాలకు దీటుగా నిలచింది. దేశ నావిగేషన్ సేవల అవసరాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 31 మరోసారి విజయబావుటా ఎగరవేసింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన 1425కిలోల బరువుగల భారత నాలుగో క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థకు సంబంధించిన (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ) నావిగేషన్ సేవలకు సంబంధించిన ఉపగ్రహాన్ని నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్) వేదికైంది. సోమవారం ఉదయం 9:31గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 48గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఆ తరువాత బుధవారం ఉదయం 9:31గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి 31 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశలను సునాయాసంగా పూర్తిచేసుకొని ఉపగ్రహాన్ని రోదసీలో విడిచిపెట్టింది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో వరుసగా 32వ విజయాన్ని నమోదు చేస్తూ పిఎస్‌ఎల్‌వి-సి 31 వాహక నౌక ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని 19:36 నిమిషాలకు విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అనంతరం దశల వారీగా 284కిలో మీటర్ల ఫెరిజి పెంచుకుంటూ భూమికి 36వేల కిలో మీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని శాస్తవ్రేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ విజయంతో దేశానికి నావిగేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకు ముందు ఈ సేవలకు విదేశాలపై ఆధారపడేవారు. ఈ ఉపగ్రహ తయారీకి రూ.125కోట్లు వ్యయం కాగా, నావిగేషన్ వ్యవస్థ ప్రయోగాలకు మొత్తం రూ.1400కోట్లు వ్యయం కేటాయించారు. అయితే ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలు అమర్చారు. నావిగేషన్ (దిక్చూచి) పేలోడ్స్‌లో ఎల్ 5 బ్యాండ్, ఎస్ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్‌ను పంపారు. దీని ద్వారా దేశం చుట్టు 1500కి.మీ వరకు అన్ని రకాల శీతోష్టస్థితి గతులను, వాహన చోదకుల దిశ,నిర్ధేశలను సులువుగా తెలుసుకోవచ్చును.
మిషన్ కంట్రోలర్ సెంటర్ నుండి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న శాస్తవ్రేత్తలు రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరిన తరువాత రాకెట్ నాలుగు దశలను ఒకదాని తరువాత ఒకటి నిర్ధేశించిన సమయానికే తన నాలుగు దశలను పూర్తిచేసుకొని రాకెట్ నుండి ఉపగ్రహం విడిపోయి కక్ష్యలోకి దూసుకెళ్లింది. అక్కడే రాకెట్ గమనాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా గమనిస్తున్న రేంజ్ ఆపరేషన్ వారు రాకెట్ నాలుగో దశ పూర్తిచేసినట్లు నిర్ధారించడంతో మిషన్ కంట్రోలర్ సెంటర్‌లో ఉన్న ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ తన హర్షధ్వనులతో భారత క్షేత్రీయ దిక్సూచి ప్రయోగం అనుకొన్న కక్ష్యలోకి విజయవంతంగా చేర్చామని అక్కడున్న శాస్తవ్రేత్తలను ఆలింగనం చేసుకొని పిఎస్‌ఎల్‌వి-సి 31ప్రయోగం విజయవంతమని ప్రకటించారు.
రాకెట్ దశల వారీగా విడిపోయింది ఇలా..
320టన్నుల బరువు 44.4మీటర్ల ఎత్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్ భూభాగం నుంచి నింగిలోకి ఎగిరిన అనంతరం అన్ని దశలను సునాయశంగా పూర్తిచేసి ఉపగ్రహాన్ని విజయవంతంగా భూస్థిర కక్ష్యలోకి చేర్చింది. కోర్ అలోన్ దశలో 138.2 టన్నులు, ఎక్స్ ఎల్ స్ట్ఫ్రాన్ బూస్టర్ల మోటార్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం ద్వారా మొదటి దశ 452కిలో మీటర్ల వేగంతో 1:50నిమిషాలకు 56కి.మీ ఎత్తుకు చేర్చి తొలి దశ మోటారు రాకెట్ నుంచి విడిపోయింది. 42టన్నుల ద్రవ ఇంధన సాయంతో రెండో దశ మోటారు అంటుకొని సెకనుకు 2396కిలో మీటర్ల వేగంతో 4:23నిమిషాలకు 134కి.మీ ఎత్తుకు చేరినంతరం రెండో దశ మోటారు విడిపోయింది. 7.6 టన్నుల ఘన ఇంధన సాయంతో మూడో దశ 7736కిలో మీటర్ల వేగంతో 10:07నిమిషాలకు 186.2కి.మీ ఎత్తుకు చేరినంతరం నాలుగో దశ 2.5 టన్నుల ద్రవ ఇంధన సాయంతో ప్రారంభమై 9642.2మీటర్ల వేగంతో 18:43నిమిషాలకు 451.5 మీటర్ల ఎత్తుకు చేరినంతరం నాలుగో దశను పూర్తిచేసింది.

ఈ ఏడాదిలోనే
స్వదేశీ దిక్సూచి

మార్చిలోపు మరో రెండు నావిగేషన్ ఉపగ్రహాలు
డిసెంబర్‌లో జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 ప్రయోగం
ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ వెల్లడి

సూళ్లూరుపేట, జనవరి 20: ఈ ఏడాది చివరికి స్వదేశీ దిక్సూచిని అందుబాటులోకి తెస్తామని ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. పిఎస్‌ఎల్‌వి-సి31 విజయవంతం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుండి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవానికి ముందు దేశానికి ఈ విజయం కానుకగా ఇచ్చామన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇస్రో తొలి విజయం సాధించడం శుభారంభమన్నారు. ఇదివరలో మన దేశంలో జిపిఎస్ సేవలకోసం విదేశాలపై ఆధారపడే వారమని, ప్రస్తుతం ఐఆర్‌ఎన్‌ఎస్ ఉపగ్రహ విజయంతో మనమే సొంతంగా నావిగేషన్ సేవలు అందించవచ్చునన్నారు. పిఎస్‌ఎల్‌వి మరోసారి శాస్తవ్రేత్తల నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. ఈ శ్రేణి ఉపగ్రహ ప్రయోగాలు మార్చి చివరిలోపు మరో రెండు ప్రయోగాలు చేపట్టి నావిగేషన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ రెండు ప్రయోగాలు కూడా పిఎస్‌ఎల్‌వి ద్వారానే చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడాది చివరిలో డిసెంబరులో జిఎస్‌ఎల్‌వి-మార్క్3 ద్వారా ఒక ఉపగ్రహాన్ని పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో షార్ కేంద్రం ఆగ్రదేశాలకు దీటుగా ప్రయోగాలు చేపటే కేంద్రంగా మారుతుందన్నారు. దీని విజయానికి కృషి చేసిన శాస్తవ్రేత్తలందరిని ఆయన అభినందించారు. షార్ డైరెక్టర్ ఉన్హికృష్ణన్, మిషన్ డైరెక్టర్ జయకుమార్, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్ డాక్టర్ కె.శివన్, ఎల్‌పిఎస్‌సి డైరెక్టర్ సోమనాధ్, మహేంద్రగిరి ఐపిఆర్‌సి డైరెక్టర్ రాకేష్, ఐఐఎస్‌యు డైరెక్టర్ మోహన్‌లాల్, ఐశాక్ డైరెక్టర్ అన్నాదురై, శాక్ డైరెక్టర్ తపన్ మిశ్రా, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ప్రాజెక్టు డైరెక్టర్ రామనాథన్ తదితరులు మాట్లాడుతూ అందరి సమష్టి కృషివల్లే ప్రయోగం విజయవంతం అయందన్నారు.

ప్రయోగం విజయవంతమయన వెంటనే చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న శాస్తవ్రేత్తలు

పిఎస్‌ఎల్‌వి విజయపరంపర
శాస్తవ్రేత్తల్లో ఉత్సాహం
సూళ్లూరుపేట, జనవరి 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరోసారి ఇనుమడించింది. ఇస్రో నమ్మినబంటు పిఎస్‌ఎల్‌వి విజయ పరంపరలు షార్‌లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేయడంతో పాటు విజయగర్వం తొణికిసలాడుతోంది. ఇప్పటి వరకు షార్ నుండి మొత్తం 32 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరిగాయి. తొలి ప్రయోగం మినిహా మిగిలినవన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు పాకాయి. చిన్న రాకెట్ల నుండి మొదలు పెట్టిన బుడిబుడి అడుగులు వేసుకుంటున్న శాస్తవ్రేత్తలు నేడు భారీ ప్రయోగాల వైపు పరుగులు తీసే స్థాయికి చేరారు. గతంతో ఇదే తరహాలో చంద్రయాన్-1 ద్వారా ఒకేసారి పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత కూడా ఇస్రోదే. అరుణగ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపి శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. మళ్లీ ఆగ్ర దేశాలకు దీటుగా నావిగేషన్ సేవలకు శ్రీకారం చుట్టి సొంత నావిగేషన్ వ్యవస్థకు రూపకల్పనలో విజయం చెందారు. శ్రీహరికోట నుండి బుధవారం ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 31 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో శాస్తవ్రేత్తలతోపాటు ఉద్యోగులందరూ సంబరాలు చేసుకొన్నారు. షార్‌తో పాటు పక్కనే సూళ్లూరుపేట ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది అందరి విజయం : షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్
నావిగేషన్ ఉపగ్రహం విజయం అందరి విజయంగా షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అభివర్ణించారు. డిసెంబర్‌లో జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 ద్వారా ఉపగ్రహాన్ని పంపేందుకు సన్నాహం చేస్తున్నామన్నారు. తక్కువ కాల వ్యవధిలోనే పిఎస్‌ఎల్‌వి-సి 31 రాకెట్‌ను సిద్ధం చేసి మరో విజయాన్ని అందుకొన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి, మావవాళికి ఉపయోగ పడే ప్రయోగాలను చేపట్టేందుకు శాస్తవ్రేత్తలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.