రాష్ట్రీయం

నాకు ప్రాణహాని ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య సోమవారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మను కలిశారు. ఆర్యవైశ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన డిజిపికి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు’ అనే పుస్తకం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐలయ్య రాసిన పుస్తకంలో ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందని ఆర్యవైశ్య సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం ఆర్యవైశ్యులు కంచ ఐలయ్య ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటిని ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా కంచ ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా రెండు రాష్ట్రాల్లో తనను ఎన్నో రకాలుగా అవమానిస్తున్నారని, తన పుస్తకంపై మేధావులతో జెఎన్‌యూలో చర్చకు సిద్ధమని, దేశంలోని ఆర్థిక శాస్తవ్రేత్తల ఆధ్వర్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దీనిని నిర్వహించాలన్నారు.
దేశంలో అతిపెద్ద సామాజిక స్మగ్లింగ్, డీమానిటైజేషన్ అని ఐలయ్య ఆరోపించారు.