రాష్ట్రీయం

బీసీలకూ.. పెళ్లికానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: వచ్చే జనవరి నుంచి బీసీలకు చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. పెళ్లి సమయంలో ఒక్కో జంటకు రూ.30 వేలు అందజేయనున్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఎంపిక చేసిన మున్సిపల్ స్కూళ్లలో వర్చువల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర దేశాల్లోని తెలుగువారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.40 కోట్లతో ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీకీ మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడి సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం సమావేశమైంది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన భేటీలో వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
* వెనుకబడిన తరగతులకు చెందిన నూతన వధూవరులకు పెళ్లి సమయంలో ఆర్థిక సాయం అందించే కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. చంద్రన్న పెళ్లికానుక పేరుతో తెల్లకార్డు ఉన్నవారికి, దారిద్య్ర రేఖకు దిగువనున్న బిసి కులాల పథకం వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తూ రూ.120 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది. ఈ పథకానికి మరో రెండేళ్ల తర్వాత టెన్త్ అర్హత విధించాలని సిఎం ప్రతిపాదించారు. ఇక నుంచి జనన మరణాలతోపాటు వివాహ నమోదు కూడా తప్పనిసరి చేయాలని సిఎం ఆదేశించారు.
* రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపల్ స్కూళ్లలో వర్చువల్ క్లాస్‌రూమ్‌లు అమలు చేయనున్నారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే చర్యల్లో భాగంగా ఎంపిక చేసిన మున్సిపల్ పాఠశాలల్లో రూ.160 కోట్లతో అమలు చేసేందుకు నిర్ణయస్తూ, డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఇందుకు అవసరమైన కంటెంట్ తయారు చేసే పనిని విద్యాశాఖకు అప్పగించారు.
* ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రూ.40 కోట్లతో ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీని రూపొందించారు. ఎపిఎన్‌ఆర్‌టిల సంక్షేమం, రక్షణ,
పునరావాసం కోసం సమగ్రంగా ఈ పాలసీని రూపొందించారు. దీనివలన రాష్ట్రానికి చెందిన 25 లక్షల మంది ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్తున్న వారికోసం 24 గంటల హెల్ప్‌లైన్‌ను, బీమా, ప్రవాసాంధ్ర సహాయనిధి ఏర్పాటు చేయనున్నారు.
* సిఆర్‌డిఎ పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంతాన్ని వైబ్రెంట్ ఎకనామిక్ హబ్‌గా మార్చేందుకు, గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమి, బ్రహ్మకుమారి సొసైటీ, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్, జెవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లకు భూములు కేటాయస్తారు.
* పోలవరం కుడి ప్రధాన కాలువ రహదారి నిర్మాణం అంచనాలకు సవరణ.
* ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్ ముసాయిదాకు ఆమోదం. దీనివలన రాష్ట్రంలోవ్యాపార అనుకూల వాతావరణం మరింత మెరుగవుతుంది.
* చిత్తూరు జిల్లా మోడరన్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టైర్ మ్యాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌కు భూ కేటాయింపులో కొన్ని మినహాయింపులను ఆమోదించింది. ప్లాంట్ నిర్మాణంలో జాప్యం జరిగినందుకు విధించిన అపరాధ రుసుముకు మినహాయింపు.
* విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం, కడప జిల్లా రైల్వేకోడూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వీలుగా భూమిని ఎపిఐఐసికి బదలాయింపు.
* విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో నాలుగు ఎకరాల భూమిని ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖకు భూమి అప్పగింత.
* ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నాయుడుపాలెంలో 132 ఎకరాలలో విజ్ఞాన్ కళాశాల ఏర్పాటుకు వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీకి ఉచితంగా కేటాయింపు.
* పొట్టిశ్రీరాములు మండలం రాజవోలులో నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ రైలుమార్గంలో వరల్డ్ క్లాస్ స్టేషన్ నిర్మాణానికి స్థలం అప్పగింతకు గ్రీన్ సిగ్నల్
* పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో మానవవనరుల నియామకానికి ఆమోదం. ఎంతమంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం ఆదేశం.

చిత్రం..ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం దృశ్యం