రాష్ట్రీయం

ఏక్షణాన్నయినా గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 10: కాస్త ఆలస్యంగానైనా ఎట్టకేలకు శ్రీశైలం జలాశయం నిండుకుండ దశకు చేరుకుంది. మట్టం పూర్తిస్థాయకి చేరడంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో ఏ క్షణాన్నయినా గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. జలాశయంలో నీటి నిల్వలు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపామని, ఆదేశాలు రాగానే గేట్లు ఎత్తుతామని అంటున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 803.10 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టిఎంసి కాగా ప్రస్తుతం 205.66 టిఎంసి నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకుతోడు తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి 1,44,240 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలాశయం నిండడం ఈసారి కష్టమేనని అంతా భావించారు. అయితే రెండు నెలలు ఆలస్యంగానైనా ఎగువ నుంచి నీరు రావడం, భారీ వర్షాలు కురవడంతో నెల రోజుల్లోనే శ్రీశైలం నిండటం గమనార్హం. ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల్లోని 13 జనరేటర్లను వినియోగించి విద్యుదుత్పత్తి చేసిన అనంతరం 73,970 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 6 వేలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి 1,600, హంద్రీ- నీవా ఎత్తిపోతల నుంచి 2 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయానికి వస్తున్న నీటిలో బయటకు వెళ్తున్న నీరుపోను సుమారు 62 వేల క్యూసెక్కుల నిల్వ ఉంటోంది. దీని కారణంగా బుధవారం తెల్లవారుజాము సమయానికి నీటిమట్టం 884 అడుగులకు పైగా చేరుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులో ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ఒక్క గేటైనా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

చిత్రం..వరద నీటితో కళకళలాడుతున్న శ్రీశైలం జలాశయం