రాష్ట్రీయం

కొట్టుకుపోయిన కాజ్‌వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, అక్టోబర్ 10: గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలమనేరు- క్రిష్ణగిరి అంతర్ రాష్ట్ర రహదారిలో పిఇఎస్ కళాశాల సమీపంలోని పోడూరు వద్ద కొత్తగా నిర్మించిన కాజ్‌వే సోమవారం అర్థరాత్రి కొట్టుకుపోయింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో ఆగిపోయాయి. కుప్పం, గుడుపల్లి, రాళ్లబూదుగూరు పోలీసులు హుటాహుటిన కాజ్‌వే వద్దకు చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి ప్రయాణికులు అవస్థలు తగ్గించారు. కాగా పాలారు నదిలో నీటిప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో తుమ్మిశి- గోవిందపల్లి మీదుగా కుప్పం వచ్చే రహదారిలో రాకపోకలను ఆపేశారు. ఇదిలావుండగా కర్నాటక రాష్ట్రం నంది హిల్స్ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పాలారు నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు మంగళవారం ఉదయం బేత్‌మంగళం రిజర్వాయర్ 16 గేట్లు ఎత్తేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 25 ఏళ్ల తర్వాత రిజర్వాయరుకు నీరు రావడంతో అక్కడి ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

చిత్రం..కుప్పం -పలమనేరు రహదారిలో పోడూరు వద్ద కొట్టుకుపోయిన కాజ్‌వే