రాష్ట్రీయం

నవంబర్ 2 నుంచి పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 10: కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నవంబర్ 2నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన యువభేరిలో పాదయాత్ర వివరాలు, దాని ఉద్దేశ్యం వివరించారు. ఆరు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీదుగా సమారు 3 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర సాగుతుందన్నారు. పాదయాత్ర సందర్భంగా ఓ పక్క పార్టీని బలోపేతం చేయడంతో పాటు మరోపక్క ప్రభుత్వం అసమర్థతను నిలదీస్తామన్నారు. ప్రత్యేక హోదావల్ల ఒనగూరే లాభాలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. యువభేరి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలనే
ఉద్దేశ్యంతోనే నియోజకవర్గ కోఆర్డినేటర్లు యూనివర్శిటీలు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తారన్నారు. ప్రజల మద్దతు కూడగడుతూ అవసరమైతే చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ జరుగుతాయని జగన్ వివరించారు. పిల్లలకు పరీక్షలనే ఆరు నెలల పాటు ఉద్యమానికి విరామం ఇచ్చామన్నారు. ఈ ఆరు నెలల్లో ఎవరైనా హోదా గురించి మాట్లాడారా? అని జగన్ ప్రశ్నించారు. జగన్ మాట్లాడితేనే హోదా అనే పరిస్థితి మారాలన్నారు. పాలకులపై వత్తిడి పెరగాలన్నారు. అందుకు పోరాటం చేయాలని, దీనికి మీ అందరి తోడ్పాటు, సహకారం కావాలని జగన్ కోరారు.