రాష్ట్రీయం

నరుూం అక్రమాస్తులపై ఇడి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టింది. నరుూం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమై 14 నెలలు గడిచింది. నరుూం సహ అతని అనుచరులపై హత్యలు, భూకబ్జాలు, కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, బెదిరింపులపై 207 కేసులు నమోదయ్యాయి. దాదాపు 800 మందిని సాక్షులుగా విచారించిన సిట్ ఇప్పటి వరకు 40 చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. అదేవిధంగా ఇటీవల ఐటీ శాఖ కూడా నరుూం అక్రమాస్తులపై కనే్నసింది. నరుూం కుటుంబీకులు, బంధువులకు ఇప్పటికే నోటీసులు అందజేసింది. అయితే ఈ నోటీసులపై ఎలాంటి స్పందన రాలేదు. మరోమారు నోటీసులు జారీ చేసి చట్టప్రకారం నరుూం కుటుంబీకులు, బంధువులపై చర్యలు తీసుకోనున్నట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు. కాగా తాజాగా ఈడి కూడా మనిలాండరింగ్ చట్టం ప్రకారం నరుూం ఆస్తులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు సిట్ అధికారుల నుంచి దాఖలైన చార్జ్‌షీట్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు పడగా, రాజకీయ నాయకులపై విచారణ కొనసాగుతోంది.

నరుూం ఫైల్‌పొటో