రాష్ట్రీయం

ఎన్టీఆర్ జీవిత కోణంలోనే సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, అక్టోబర్ 10: ప్రముఖ సినీనటుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగానే సినిమా తెరకెక్కిస్తున్నట్టు సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. మంగళవారం పలమనేరు వైకాపా కన్వీనర్ రాకేష్‌రెడ్డి స్వగృహంలో ప్రముఖ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రామాయణం, మహాభారతంలో జరిగిన ఆశక్తికర ఘటనలు ఆధారంగానే ఎన్టీఆర్ జీవితం కూడా ఆధారపడి ఉందన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీ ఆర్ రాజకీయ జీవితంపై పూర్తిగా అనే్వషించి కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సినిమాలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలన్‌గా చూపిస్తారా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు వర్మ సమాధానం ఇస్తూ నాకథలో హీరో, విలన్‌లు అనేవి మనం కల్పించుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నారు. ఈ సినిమా కథలో ప్రముఖంగా వైశ్రాయ్ హోటల్‌లో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా సినిమా ఉంటుందన్నారు. ఎపిలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా నాయకుడు రాకేష్‌రెడ్డి నిర్మాతగా తీసుకోవడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా అని అడుగగా రాకేష్‌రెడ్డి వైకాపాలో ఉన్నట్లు కూడా తనకు గతంలో తెలియదన్నారు. సినీ పరిశ్రమతో సంబంధంలేని వ్యక్తిని నిర్మాతగా ఎంపిక చేయడం విమర్శలకు చోటిచ్చినట్టేగా అని మరో విలేఖరి ప్రశ్నించడంతో తాను రాజకీయాలకు అతీతుడని, ఎన్టీఆర్ వీరాభిమానిని అని సమాధానమిచ్చారు. రాకేష్‌రెడ్డి తనకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి పరిచయం ఉందని అన్నారు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రకు నగరి ఎమ్మెల్యే రోజాను ఎంపిక చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయన్న దానిపై ఆయన స్పందిస్తూ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి నటులను ఎవరిని ఎంపిక చేయలేదన్నారు. ఈ సినిమాలోని పాత్రలు అన్ని కల్పితాలే అని తేల్చి చెప్పారు. లక్ష్మీ పార్వతి విషయాన్ని ప్రస్తావించగా ఈ సినిమాలో తాను అనుకున్న కోణంలోనే ఈ పాత్ర ఉంటుందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. . ఎన్టీఆర్ మహానటుడు, మహా నేతని అయితే ఈ సినిమా ఎన్టీ ఆర్ రాజకీయ కోణంలోనే కొనసాగుతుందన్నారు. ఈ సినిమాపై రాజకీయాలతో ముడికట్టడం భావ్యం కాదన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై అదే సంవత్సరంలో అక్టోబర్‌లో విడుదల చేయాలని సంకల్పించామన్నారు. సినీ నిర్మాత రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని, ఆయన జీవితాన్ని ఆధారంగానే సినిమా తీయాలని నిర్ణయించామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని తేల్చి చెప్పారు. దీనితో రామ్‌గోపాల్‌వర్మ పలమనేరు విచ్చేస్తున్నారని తెలియడంతో మండల పరిధిలోని వైకాపా నాయకులు, అభిమానులు తరలి వచ్చారు. ఒకమారు విలేఖర్ల సమావేశం నిర్వహిస్తుండగానే గందరగోళ పరిస్థితి నెలకొనడంతో మరో చోటికి మార్చారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. పలమనేరులో వైకాపా నాయకులు రాకేష్‌రెడ్డితో కలిసి
విలేఖరులతో మాట్లాడుతున్న సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ