రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ కేసుపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: అగ్రిగోల్డ్ కంపెనీలకు సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించేందుకు ఇకపై జాప్యం చేయరాదని, తక్షణమే మూడు బృందాలను ఏర్పాటు చేసి నిర్దేశించిన పనిని వేగవంతం చేయాలని హైకోర్టు అకౌంటింగ్ సంస్ధ డెలాయిట్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్లు ఏపి సిఐడి కస్టడీలో ఉన్నాయి. అగ్రిగోల్డ్ కంపెనీని టేకోవర్ చేసేందుకు ఎస్సె జీ గ్రూపుకు చెందిన సుభాష్ పౌండేషన్ ముందుకు వచ్చిన సంగతి విదితమే. ఈ కేసుపై సిబిఐ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. డెలాయిట్ సంస్ధ ప్రతినిధులు అక్టోబర్ 12వ తేదీన సిఐడి ప్రధాన కార్యాలయం, అగ్రిగోల్డ్ కార్పోరేట్ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్ల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అలాగే ఏలూరు జైలులో ఉన్న అగ్రిగోల్డ్ యాజమాన్య ప్రతినిధులను కలిసి డాక్యుమెంట్ల పరిశీలన చేపట్టాలని డెలాయిట్ సంస్ధను హైకోర్టు ఆదేశించింది. తాము ఇంతవరకు సంబంధిత ఏజన్సీలతో సంప్రదింపులు జరిపామని, పనిని ప్రారంభించలేదని డెలాయిట్ సంస్ధ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై ఆ సంస్ధ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అనంతరం ఈ కేసు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.