రాష్ట్రీయం

విశ్వగురు స్థానంలోకి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితిలో భారత్ ఉన్నత శిఖరాలవైపు వెళుతుందని, త్వరలోనే విశ్వగురు స్థానం చేరుతుందని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. నాలుగు నెలల అమెరికా పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఇక్కడకు చేరారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, అమెరికన్ల ఆలోచనల్లో పూర్తిగా మార్పు వచ్చిందని, భారత్‌తో స్నేహం కొనసాగించాలనే అమెరికన్లు ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. విశ్వశాంతి ప్రధాన లక్ష్యంగా కొనసాగిన తన అమెరికా పర్యటన విజయవంతమైందన్నారు. జూలైలో అమెరికా వెళ్లిన విశ్వయోగి విశ్వంజీ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మత సంస్థలు, విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రసంగించారు. అమెరికాలోని పాలకులతో చర్చలు జరిపారు. భారత్-అమెరికాల మధ్య స్నేహం మరింత పెంపొందుతుందని, గత రెండు దశాబ్దాల నుండి తాను అమెరికాలో జరుపుతున్న దివ్యపర్యటన మంచిఫలాలు అందిస్తోందన్నారు. ఈ రెండు దేశాలు బాగా ఉంటే ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ బాగా ఉంటాయన్నారు. ప్రపంచం ఒక దేహంగా భావిస్తే భారత్ హృదయంగా పనిచేస్తోందని, అమెరికా మెదడులా పనిచేస్తోందన్నారు. హృదయం స్వచ్ఛమైన రక్తాన్ని మెదడుకు అందిస్తే, మెదడు ఈ రక్తాన్ని దేహంలోని ఇతర భాగాలకు అందిస్తుందని, దాంతో దేహంలోని ఇతర బాగాలుగా భావించే ఇతర దేశాలన్నీ చక్కగా పనిచేస్తాయన్నారు. ప్రపంచమంతా ఐక్యంగా ఉండాలని, విశ్వశాంతి చేకూరాలన్నదే రుషులు, యోగుల ఉద్దేశమన్నారు. తన దృష్టిలో ‘ప్రేమ’ అన్నదే మతమని, మానవత్వమే ‘కులం’ అని వివరించారు. హృదయాన్ని ప్రేమతో నింపాలని, మనస్సును శాంతిగా ఉంచాలని విశ్వంజీ పేర్కొన్నారు. శాంతి, ప్రేమ కలిస్తే జగమంతా ప్రశాంతి నిలయంగా ఉంటుందన్నారు. మానవత్వమే అందరిలక్ష్యంగా ఉండాలని, విశ్వప్రేమ ప్రధాన మార్గంగా ఉండాలన్నారు. భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి వెలుగు చూపుతూ వస్తోందన్నారు. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాల మధ్య సమతుల్యత ఉండాలని, ఇవి కలుషితం అయితే సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలకు దారి తీస్తుందన్నారు. భూమాతను పరిరక్షించుకోవాలని సూచించారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని, ప్రపంచంలోని దేశాధినేతలు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రపంచంలో ఏ దేశభవిష్యత్తు అయినా యువతపైనే ఆధారపడి ఉంటుందని, అందువల్ల మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, వ్యక్తిత్వాన్ని పెంపొదించుకోవాలని యువతకు విశ్వయోగి సూచించారు. విశ్వవిద్యాలయాలు అశాంతికేంద్రాలుగా మారుతున్నాయని, ఈ పరిస్థితి మారి ‘విశ్వవిద్య’కు (యూనివర్సల్ ఎడ్యుకేషన్) ప్రాధాన్యత లభించేలా విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతల సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా కృషి చేయాలన్నారు. జీవితం సమస్యలమయంగా ఉంటుందని, ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలని, కష్టపడి పనిచేసే తత్వం చిన్నప్పటినుండే అలవాటు చేయాలన్నారు. అనేక దేశాలకు ఇబ్బందిగా ఉన్న ఉగ్రవాదం త్వరలోనే సమసిపోతుందని విశ్వంజీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వయంగా శాంతిగా ఉంటూ, కుటుంబాన్ని శాంతిగా ఉండేలా చూడాలని తద్వారా సమాజంలో ప్రశాంతవాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

చిత్రం..అమెరికా పర్యటన ముగించుకు తిరిగి వచ్చిన విశ్వంజీకి ఘనంగా స్వాగతం పలుకుతున్న భక్తులు