రాష్ట్రీయం

కృష్ణా నదికి వరద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 13: కృష్ణానదికి వరద ముప్పు పొంచి ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం శుక్రవారం రాత్రి హెచ్చరికలు జారీ చేసింది. పెద్దమొత్తంలో వరద వచ్చే అవకాశం ఉన్నందున కృష్ణానదిపై ఉన్న జలాశయాల్లో నీటిని యుద్ధప్రాతిదికన ఖాళీ చేయాలని
సూచించింది. ప్రస్తుతం నిండుగా ఉన్న జలాశయాలను ఖాళీ చేసి దిగువకు నీరు విడుదల చేసి సాధ్యమైనంత ఎక్కువ ఖాళీగా ఉంచాలని జలసంఘం సూచించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తాలని ఆదేశించింది. జలాశయం నాలుగవ గేటును రాత్రి 11 గంటల సమయంలో అధికారులు ఎత్తారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో గురువారం రెండు గేట్లు ఎత్తివేసిన సంగతి విదితమే. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో మరింతగా పెరగడంతో శుక్రవారం సాయంత్రం మరో గేటు ఎత్తారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో సిడబ్ల్యుసి నుంచి వచ్చిన హెచ్చరికలు, ఆదేశాలతో నాలుగవ గేటును కూడా ఎత్తివేశారు. దీంతో నాలుగు గేట్ల ద్వారా సాగర్‌కు 1.12 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం సుమారు 75 వేల క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. సిడబ్ల్యుసి హెచ్చరికల ప్రకారం శనివారం ఉదయానికి శ్రీశైలం జలాశయానికి 2 నుంచి 2.20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని గుణించి అవసరమైతే శనివారం మరిన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా కృష్ణానదికి వరద ముప్పు ఉందని సిడబ్ల్యుసి హెచ్చరించిన నేపథ్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రాత్రి జలవనరుల శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర హెచ్చరికల కారణంగా కృష్ణానది పరివాహక గ్రామాలు, జలాశయానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఏ పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరో వైపు సిడబ్ల్యుసి హెచ్చరికలు, శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తివేత, వరద ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు.