తెలంగాణ

మిగిలింది ఐదు రోజులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి ఐదు రోజులే మిగిలింది. అన్ని పార్టీలూ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్ర నేతలంతా ప్రచార బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. 30న జింఖానా మైదానంలో తెరాస నిర్వహించనున్న బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. అయితే బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడి గ్రేటర్‌లో విజయం సాధిస్తే ఏంచేస్తారో స్పష్టంగా వివరించనున్నారు. మరోవైపు తెదేపా-్భజపా మిత్రపక్షాల అభ్యర్థుల విజయం కోసం బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా జాతీయాధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు 28, 29 తేదీల్లో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు. సిఎం కెసిఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కెటిఆర్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా పర్యటిస్తుండడంతో లోకేష్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెదేపా నేతలు చెబుతున్నారు. టి.కాంగ్రెస్ నేతలు కూడా గ్రేటర్‌లో నలువైపులా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టిపిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఐదు రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మరోవైపు ప్రచారం సాగిస్తున్నారు. ఇలాఉండగా ఏఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ 29న, ఏఐసిసి నాయకుడు గులాంనబీ ఆజాద్ 30న గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ప్రభుత్వ హామీలతో మోసపోవద్దు: వెంకయ్య
బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం సైదాబాద్, ఐఎస్ సదన్, గౌలిపురా తదితర డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ హామీలు చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తాను వివాదాలు మాట్లాడేందుకు రాలేదని, సీమాంధ్ర నుంచి లేదా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని సెటిలర్లు అనాల్సిన అవసరం లేదన్నారు. నాడు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు.
బీఫ్ పేరుతో ఓట్లు అడుగుతారా?
అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలే తప్ప బీఫ్ పేరు చెప్పి ఓట్లు అడగడం తనకు విస్మయం కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు. బీఫ్ పేరిట ఓట్లు అడగడం దారుణమని ఆయన విమర్శించారు. అమృత్ పథకం కింద తెలంగాణకు 400 కోట్లకు పైగా నిధులు కేటాయించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కింది స్థాయి వరకూ సక్రమంగా అమలు కావాలంటే మంచి కార్పోరేటర్లు ఉండాలని ఆయన తెలిపారు. సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై వాస్తవాలు ఏమిటో వెలుగులోకి రావాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
‘క్యూ’ కట్టిన కంపెనీలు: కెటిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మంత్రి కెటిఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటి కంపెనీలు తెలంగాణకు ‘క్యూ’ కట్టాయని అన్నారు. పేదలు గౌరవంగా బతకాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. అందుకే పేదల కోసం రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణ చేపట్టారని ఆయన చెప్పారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు చేయలేని పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే వీటిని చూసి ఓర్వలేక, జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని అన్నారు.