రాష్ట్రీయం

ఏమి చేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణలో జోన్ల సంఖ్య పెంచే అంశంపై శుక్రవారం నాడు సుదీర్ఘ చర్చ జరిగింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌పి సింగ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కొత్త జోనల్ విధానం, స్థానికతను ఈ సమావేశంలో చర్చించడంతో పాటు రాష్టప్రతి నిబంధనల సవరణ లేదా కొత్తగా నిబంధనలను ఏర్పాటు చేసుకోవాలా అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పలు ఇతర అంశాలను సైతం
చర్చించింది. రాష్టప్రతి నిబంధనల్లో మార్పులు మంచిదా, కొత్త నిబంధనలు రూపొందించడం మంచిదా అన్న అంశంపై సుదీర్ఘ చర్చే జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించినట్టు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయా జిల్లాల్లోని స్థానికులకు ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర, మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయి పోస్టుల విభజన కూడా జరగాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా క్యాడర్ అంటే ఎలా ఉండాలి అనే దానిపై అధికారులతో ప్రాధమిక సమాచారం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. ముఖ్యమైన ఈ అంశంపై మరిన్ని సమావేశాలు జరిగిన తర్వాతనే తుది నిర్ణయానికి వస్తామని
డిప్యుటీ సిఎం చెప్పారు. ఈ నెల 21వ తేదీన మరోమారు సమావేశమై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా రాష్టప్రతి నిబంధనలకు సంబంధించిన ఈ ఉన్నత స్థాయి కమిటీ తన ప్రతిపాదనలను సిద్ధం చేసి సిఎం కెసిఆర్‌కు అందిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎస్ కె జోషి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, డైరీ డెవలప్‌మెంట్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేష్ చందా, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి బి ఆర్ మీనా, న్యాయశాఖ కార్యదర్శి వి నిరంజన్ రావు, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ మిశ్రా, సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా తదితరులు కూడా హాజరయ్యారు.

చిత్రం..ఉన్నతాధికారుల భేటీలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం