రాష్ట్రీయం

వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం 4000 ఎకరాల అటవీ భూమి సేకరణకు సంబంధించిన అనుమతుల కోసం వారం రోజుల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని 1000 ఎకరాల అనుమతి కోసం పది రోజులలో ప్రతిపాదనలు పంపించాలని మంత్రి గడువు విధించారు. ఆయా శాఖల అనుమతుల కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మంత్రి సూచించారు. అటవీ, రెవిన్యూ శాఖలు సమన్వయం చేసుకొని అటవీ భూముల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుకు చెందిన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులతో పాటు పంప్ హౌజ్‌లు, కెనాల్స్ ఇతర పనుల పురోగతిపై జలసౌధలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇందులో 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 3,28,853 ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. ప్యాకేజీల వారీగా పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. మొత్తం 8 ప్యాకేజీలలో ప్రస్తుతం 3 ప్యాకేజీల పనులు ప్రారంభం
కాగా మిగతా 5 ప్యాకేజీలకు ఒప్పందం కుదిరిందన్నారు. ప్యాకేజీ 8 పనులు కూడా సంబంధిత ఏజెన్సీతో ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. మొత్తం 5 పంప్ హౌజ్‌లకు గాను ఒక పంప్ హౌజ్ పనులు మాత్రమే గ్రౌండ్ కాగా మరో పంప్ హౌజ్ పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. మిగతా 3 పంప్ హౌజ్‌ల పనులను కూడా వెంటనే చేపట్టాలన్నారు. పంప్ హౌజ్‌ల పనులతో పాటు ఇతర పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలో కార్యాచరణను రూపొందించుకోవాలని మంత్రి ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు కోసం మొత్తంగా 4445 ఎకరాల భూ సేకరణ అవసరం కాగా ఇప్పటివరకు కేవలం 374 ఎకరాల సేకరణ మాత్రమే జరిగిందని మంత్రి గుర్తు చేసారు. భూ సేకరణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లతో సమావేశం నుంచే మంత్రి ఫోన్‌లో ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించే అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా జగిత్యాల జిల్లాలో భూమి కేటాయించడానికి ప్రతిపాదనలు పంపించాలని ఆ జిల్లా కలెక్టర్ శరత్‌ను మంత్రి ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు మొదటి దశకు ఇదివరకే అటవీ, పర్యావరణశాఖల అనుమతి లభించడంతో రెండవ దశ అనుమతుల కోసం దృష్టిసారించాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

చిత్రం..అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు