రాష్ట్రీయం

ఎంసిఎకు ప్రతిపాదనలు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ఆదేశించారు. కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డితో పాటు వైద్య విద్య అధికారులతో సచివాలయంలో శుక్రవారం మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేసి మెడికల్ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి సూచించారు. పురోగతిలో ఉన్న వైద్యశాలల కొత్త భవనాలు, పాత భవనాల స్థితిగతులను కూడా మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య విద్య కమిషనర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.