రాష్ట్రీయం

23 లేక 25 నుంచి అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: శాసనసభ వర్షాకాల కాల సమావేశాలు ఈ నెల నాలుగవ వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత శాసనసభ సమావేశాలు ముగిసి ఈ నెల 29కి ఆరు నెలలు గడవడంతో ఆ లోగానే సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల మూడవ వారానికల్లా పండుగలన్నీ ముగియనుండటంతో శాసనసభ సమావేశాలను నిర్వహించనున్నట్టు ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ ముగిసిన తర్వాత ఈ నెల 23న కానీ 25న కానీ శాసనసభ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలపై రెండు ప్రతిపాదనలను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి ముందు పెట్టినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 23న సోమవారం నుంచి ప్రారంభించే పక్షంలో 27న శుక్రవారం వరకు (5 రోజులు), 25న బుధవారం ప్రారంభించే పక్షంలో 31 వరకు (ఆదివారం మినహాయించి 6 రోజులు) సమావేశాలు నిర్వహించడానికి ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదించిన వెంటనే శాసనసభ సమావేశాల నిర్వహణపై బులటిన్ విడుదల కానుంది. సమావేశాలు ఎప్పడు ప్రారంభించినా ఈ నెలాఖరుకల్లా ముగించాలని పాలకపక్షం భావిస్తున్నట్టు తెలిసింది. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో పిడి, గేమింగ్ చట్టాల సవరణ, ముస్లిం బాలికల అరబ్ షేక్‌ల వివాహాలను అరికట్టే బిల్లుతో పాటు మొత్తంగా 8 బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిసింది.