రాష్ట్రీయం

భద్రాద్రిలో సంధ్యా హారతికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 13: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘సంధ్యా హారతి’ ఆర్జిత సేవను త్రిదండి చిన జీయర్‌స్వామి శుక్రవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. భక్తుల జయ జయధ్వానాల నడుమ స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఉత్తరద్వారంలో ఉంచిన ఉయ్యాలలో కూర్చోబెట్టి పూజలు చేశారు. దీపారాధన ఇచ్చి మంగళశాసనాలు పలికారు. రామచంద్ర మహా ప్రభువుకూ జై అంటూ భక్తులు నినదించగా జీయర్ స్వామి తొలుత శ్రీ సీతారామచంద్రస్వామికి సంధ్యా హారతి ఇచ్చారు. మొత్తం నాలుగుసార్లు సంధ్యా హారతి ఇచ్చిన అనంతరం ఐదోసారి భక్తులను భాగస్వాములను చేస్తూ ఆఖరి సంధ్యా హారతి ఇచ్చి ముగించారు. ఇది వీక్షించిన భక్తులు తన్మయత్వం చెందారు. సంధ్యా హారతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, సున్నం రాజయ్య, ఎంపి సీతారాంనాయక్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధికి, ఆలయంలో జరిగే కార్యక్రమాల కొనసాగింపునకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషిని చిన జీయర్‌స్వామి కొనియాడారు. భద్రాచలంలో సంధ్యా హారతి సేవను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

చిత్రం..శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సంధ్యాహారతి ఇస్తున్న చినజీయర్ స్వామి