రాష్ట్రీయం

దేవాదాయ కమిషనర్‌కు రూ. 2వేల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: కోర్టు ధిక్కారం కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, విజయవాడ కనకదుర్గ దేవాలయం కార్యనిర్వహణాధికారి ఏ సూర్యకుమారికి రెండు వేల రూపాయల చొప్పున జరిమానాను విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనకదుర్గ ఆలయంలో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాలను అమలుచేయలేదని దాఖలైన సుమోటో కేసును హైకోర్టు విచారించింది. ఈ కేసును జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. ఉద్యోగులనియామకంపై నిషేధం ఉందని అందుకు క్యాజువల్ కార్మికుల సేవలను క్రమబద్ధీకరించలేమన్న అధికారుల వాదన హేతుబద్ధంగా లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి కోర్టుకు హాజరయ్యారు. తన దృష్టికి కోర్టు ఉత్తర్వులు రాలేదని విన్నవించారు. తనను కోర్టు ధిక్కారం కేసు నుంచి విముక్తి చేయాలని, కోర్టుకు బేషరతుగా క్షమాపణ చెబుతానని కూడా ఆమె కోర్టుకు చెప్పారు. కాగా కార్యనిర్వహణాధికారి అభ్యర్థనను కోర్టు తిరస్కరంచి ఇద్దరు అధికారులకు రెండు వేల రూపాయల చొప్పున జరిమానాను విధించింది.