రాష్ట్రీయం

శ్రీవారి లడ్డూ పోటు ఆధునీకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి,అక్టోబర్ 13: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు త్వరలోనే పోటు ఆధునీకరణకు ప్రణాళికలను రూపొందించాలని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్యభవనంలో పలు అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఒక రోజుకు 5లక్షల లడ్డూలు తయారు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సంబంధిత అధికారులు రూపొందించాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బూంది పోటు ప్రదేశంలోనే లడ్డూలు నిల్వ ఉంచేందుకు ఒక నూతన భవనాన్ని నిర్మించాలన్నారు. ఇందుకోసం దేశంలో మిఠాయిలు తయారుచేసే సంస్థ హల్దీరామ్స్, శ్రీకృష్ణ స్వీట్స్ సంస్థల సలహాలు తీసుకోవాలని టిటిడి ఇఓ అధికారులకు సూచించారు. కాగా పరకామణి సేవలు మరింత మెరుగ్గా చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని ఇఓ సూచించారు. చిల్లర నాణేలను లెక్కించడానికి ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయాలని, నోట్ల గణనకు బ్యాంకు సిబ్బంది సేవకులుగా వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగా రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి, విదేశీ కరెన్సీ మార్పిడికోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని టిటిడి ఇఓ అనిల్‌సింఘాల్ చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత భక్తులు హుండీద్వారా సమర్పించిన సుమారు 25కోట్ల మేర పాత నోట్లు టిటిడి వద్ద ఉన్నాయన్నారు. అలాగే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన విదేశీ భక్తులు హుండీల్లో సమర్పిస్తున్న విదేశీ నాణ్యాలు, కరెన్సీ మార్పిడిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. చిల్లర నాణేలను బ్యాంకులు తీసుకోవడం లేదని, వీటిని మార్చుకునే అవకాశాలను ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు