రాష్ట్రీయం

నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 14: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న వరదనీరు శనివారం సాయంత్రానికి భారీగా పెరిగింది. శనివారం మధ్యాహ్నం వరకు కూడా 2 లక్షల క్యూసెక్కుల మేరకు ఇన్‌ఫ్లో వస్తుండగా సాయంత్రం 6గంటల నుండి 2,71,717 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకుంటుంది. దీంతో సాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతూ వస్తుంది. శుక్రవారం సాయంత్రం 535 అడుగులున్న నీటిమట్టం ఒక్కరోజులోనే ఆరు అడుగుల మేరకు పెరిగింది. శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న వరదనీరు
పెరుగుతుండడంతో శ్రీశైలం డ్యాం క్రస్ట్‌గేట్ల నుండి విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని భారీగా పెంచారు. శనివారం ఉదయం ఐదు గేట్ల ద్వారా విడుదల చేసిన శ్రీశైలం డ్యాం అధికారులు శనివారం సాయంత్రం నుండి ఇన్‌ఫ్లో పెరగడంతో ఏడు క్రస్ట్‌గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,71,712 క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న వరదనీరు మరింత పెరగనున్నందున సాగర్‌కు పెరిగే నీటిపరిమాణం కూడా మరింతగా పెంచే అవకాశం ఉంది. శ్రీశైలానికి ఎగువ నుండి 1,94,431 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 190 టిఎంసి నీరు నిల్వ ఉండగా శ్రీశైలం జలాశయంలో 884.30 అడుగుల నీటిమట్టంతో 211.60 టిఎంసి సామర్ధ్యం ఉంది. ఆదివారం సాయంత్రానికి సాగర్ నీటిమట్టం డ్యాం క్రస్ట్‌గేట్లను తాకనుంది.