రాష్ట్రీయం

వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబర్ 14: శ్రీశైలం రిజర్వాయర్‌లోకి గత రెండు రోజులుగా వరదనీరు రాక పెరగడంతో క్రమంగా శనివారం మధ్యాహ్నానికి ఏడుగేట్లు ఎత్తి 1,94,278 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 104 మెగావాట్లతో ఏడు యూనిట్లు, 31,056 క్యూసెక్కుల నీటిని, ఎడమ గట్టు భూగర్భ పవర్ హౌస్‌లో ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఆరు యూనిట్ల ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కర్నూల్ జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీటిని, హంద్రీనీవా ద్వారా 1013 క్యూసెక్కులు, కెఎల్‌ఐ ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల నుంచి 1,61,078 క్యూసెక్కుల నీరు, రోజా నుంచి 31,353 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి రెండువేల క్యూసెక్కుల నీరు మొత్తం 1,94,431 క్యూసెక్కుల నీరు రిజర్వార్‌కు వచ్చి చేరుతోంది.