రాష్ట్రీయం

విఎంసి విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 14: విజయవాడ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను నగర పాలక సంస్థ (విఎంసి)లో దశలవారీగా విలీనం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం ఉదయం విజయవాడ నగరం, గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌లను ఆహ్వానించి ఒక సమావేశం నిర్వహించాలని అధికారులను కోరారు. ఆరు నెలల్లోగా ఈ పనిని పూర్తిచేయాలని ఆదేశించారు. కొండలమీద, కాల్వల పక్కన నివసిస్తున్న 50వేల కుటుంబాలకు వాంబే కాలనీలో పట్టాలివ్వాలని, 16వేల మంది లబ్ధిదారులకు వాంబే కాలనీలో గృహాలు కేటాయించాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ టిడ్కో హౌసింగ్ అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. నిర్మాణాలను పూర్తిచేయడానికి 9నెలల వ్యవధి ఇస్తున్నట్లు సిఎం చెప్పారు. పోలీసు కంట్రోల్ రూమ్ ఎదురుగా పనికిరాని పరికరాలతో గత పుష్కరాల సమయంలో ఏర్పాటుచేసిన పార్కు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బందరు కాల్వ ఇరువైపులా ఒడ్డును సుందరీకరించాలని చంద్రబాబు అన్నారు. ట్రాఫిక్ ఐలెండ్లు, కూడళ్ల అభివృద్ధిని నెల రోజుల్లో చేసి చూపాలని సిఆర్‌డిఏ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. గవర్నర్‌పేట బస్‌డిపోలోకి వెళ్లి పరిశీలించారు. ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో నాలుగు కాల్వలను
అనుసంధానం చేయాలని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించారు. కాల్వల్లో వాటర్ స్కూటర్లు లాంటి జలక్రీడలతో నగర పౌరులకు ఆహ్లాదం పంచవచ్చని చెప్పారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, సిఆర్‌డిఏ, విజయవాడ నగరపాలక సంస్థ, అమరావతి నగరాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వాంబే కాలనీవాసులకు పట్టాల అందజేత ప్రక్రియ నవంబర్ 30 నాటికి పూర్తిచేయాలని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
పాత బస్టాండు దగ్గరున్న సిఎన్జీ డిపోను 45 రోజుల్లోగా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు తరలించాలని కోరారు. ఇందుకోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఎండి ఏపి దాస్‌తో మాట్లాడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎన్జీ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని, బస్టాండు నుంచి రైల్వేస్టేషన్ దాకా ముందుగా సుందరీకరించాలని కోరారు. కనకదుర్గమ్మవారికి పూజలు చేయడానికి ఉపయోగించే ఎరుపు, పసుపురంగు పుష్ప వనాలను ఇంద్రకీలాద్రిపై పెంచాలని సూచించారు. గన్నవరం దాకా రహదారి వెడల్పు పనులను 2నెలల వ్యవధిలో పూర్తిచేయాలన్నారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ దుర్గగుడి పనులను ప్రతిరోజూ సమీక్షించాలని, సోమవారం నిర్మాణ సంస్థ యజమానులు తనను కలవాలని ఆదేశించారు. జక్కంపూడిలో 234 ఎకరాల పరిధిలో నిర్మిస్తున్న 10వేల గృహాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని, అసంపూర్తిగా నిలిచిన 4వేల జెఎన్‌యుఆర్‌ఎం గృహ నిర్మాణాలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు వైపు విజయవాడకు ముఖద్వారం దగ్గర సుందరీకరణ చేపట్టాలని కోరారు.
పది, పదిహేను కిలోమీటర్ల మేర బుడమేరు కట్ట నిర్మాణం చేపట్టడానికి పక్కనే ఉన్న 18వేల గృహాల వారికి నూతన గృహాలు నిర్మించి తరలించాల్సి ఉందన్నారు. ఇందుకు భూమి సమీకరిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచుతామని, ఇందుకు కొత్త భవనం నిర్మిస్తామన్నారు.
రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, అసాంఘిక శక్తులపై, బ్లేడ్ బ్యాచ్‌లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు. మంచినీటి చెరువులను శుద్ధిచేసి, తాగునీటికి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే వంశీ కోరారు. జిల్లా పరిషత్ రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్, వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సత్యనారాయణపురంలో స్థానికులతో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు