రాష్ట్రీయం

గో ఆధారిత సాగు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ఆరోగ్యపరమైన ఆర్థిక విజయం కోసం గో ఆధారిత ప్రకృతి సాగు ఎంతో అవసరమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఇందుకోసం సంబంధిత రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కూడా ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. స్థానిక సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల రాష్ట్ర సమ్మేళనంలో మంత్రి మాణిక్యాలరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సభకు సొసైటీ గౌరవాధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఐదువేల సంవత్సరాల క్రితమే భగవంతుడైన శ్రీకృష్ణుడు గోకులంలో జన్మించి ఆవుపేడ ఎత్తటంలో తప్పులేదని చూపించారని అన్నారు. గోపూజను మూర్ఖత్వంగా భావించే రోజులు పోయాయని అన్నారు. రసాయనిక పురుగుమందులు, ఎరువులతో కూడిన ప్రస్తుత వ్యవసాయం కోసం భారీగా పెట్టుబడులు పెట్టి ఆపై గిట్టుబాటు ధరల్లేక అదే పురుగుమందు తాగి బలవన్మరణం పొందే దౌర్భాగ్య స్థితి పోవాలన్నారు. అందుకే తక్కువ పెట్టుబడులు, ఎక్కువ శ్రమతో కూడిన వ్యవసాయాన్ని అందరూ ఆహ్వానించాల్సి
ఉందన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ పి వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, రైతుల ఆత్మహత్యలు లేని ఆంధ్రప్రదేశ్, రైతు అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయమే శరణ్యం అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లక్ష్యం కోసం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను రైతులకు అవసరమైన సహకారాలు అందించాల్సి ఉందన్నారు. తక్షణం రాష్ట్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ ప్రజారోగ్యం వైద్యం పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయన్నారు. అదే ప్రకృతి సేద్యం కోసం రైతుకు కొంతమేర సహాయమందిస్తే తద్వారా ఉత్పత్తయ్యే ఆహార పదార్థాలు తిన్నవారు ఆరోగ్యంగా ఉంటే ఖర్చు తగ్గుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల కోసం సంబంధిత కంపెనీకి ఎకరాకు రూ.10వేలు పైగా ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తున్నది కానీ, ప్రకృతి వ్యవసాయదారులకు నయాపైసా సహాయపడటం లేదన్నారు. ఆవుపాలు శ్రేష్టమని, అయితే వాటిపైనే ఆధారపడకుండా ఆవు మూత్రం, ఆవు పేడను కూడా మార్కెటింగ్ చేసుకుని లాభపడవచ్చంటూ ప్రస్తుతం మార్కెట్‌లో ఆవుపేడ కిలో రూ.120, ఆవు మూత్రం లీటరు రూ.160 ధర పలుకుతున్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతను నమ్ముకోవాలన్నారు. మురళీకృష్ణ తన అధ్యక్షోపన్యాసంలో రైతు కష్టించి పండిస్తున్నా పట్టణ వాసులే కాదు.. గ్రామీణ రైతు కుటుంబాలవారు సైతం ఆహారాన్ని వృథాగా పారవేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మెతుకు కూడా పారవేయకుండా ఉంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఆహారం దొరుకుతుందన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు కనీసం మూడేళ్ల వరకు ఎకరానికి 10వేలు చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలని, పంటకు లాభసాటి ధరను నిర్ణయించాలని దేశీయ ఆవుపాల దిగుబడి పెంచేలా పరిశోధనలు జరుగాలని, గోవుల కొనుగోలుకు 75 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరించాలని, ఈ వ్యవసాయం అభివృద్ధి కోసం రైతులు, మేధావులు, శాస్తవ్రేత్తలతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాలని తీర్మానించారు. సభలో సొసైటీ అధ్యక్షుడు బిహెచ్ రామకృష్ణంరాజు, ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, కోశాధికారి వి.ఆశాకిరణ్, ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, తదితరులు ప్రసంగించారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఆరుగురిని ఘనంగా సత్కరించారు.

చిత్రం..గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రాష్ట్ర సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి