రాష్ట్రీయం

రైతుల కష్టం.. కనిపించడం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ఆంధ్ర రాష్ట్రంలో రైతులు కష్టకాలంలో ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి, వారిని ఆదుకోకుండా సన్మానాలు, సత్కారాలు, భూ ఒప్పందాలు, విదేశీ ప్రతినిధులతో కాలక్షేపం చేయడం దారుణమని ప్రతిపక్షనేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల నష్టానికి పూర్తిగా పరిహారం ఇవ్వాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక రెండో పేజీ చూస్తే పలు పంటలు నానారకాల తెగుళ్ల బారినపడిన విషయం అర్ధమవుతుందన్నారు. వర్షాలు ప్రారంభం కాగానే తమ వల్లనే కురుస్తున్నాయంటూ ఒక జలహారతి ఇచ్చి ప్రచార డ్రామా ఆడారన్నారు. వర్షాలు ఎక్కువై రాష్ట్రంలోని రైతాంగం మునిగిపోతుంటే మాత్రమే కుంభకర్ణుడికి పెద్దన్న మాదిరిగా మంత్రిమండలి నిద్రపోతున్నదన్నారు. వరి, వేరుశెనగ, ఇతర నూనె గింజలు, పత్తి, ఉల్లి, మిరప, మినుము, కంది, మొక్కజొన్న, ఆముదం, ఇతర పంటలు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయన్నారు. రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందన పట్టించుకునే తీరిక చంద్రబాబుకు లేదని, తాను ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నానన్నారు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ ఒక మోసమని, ఇన్‌పుట్ సబ్సిడీలను ఎగగొట్టారని, సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలను సంపూర్ణంగా భూమిలో పాతేశారన్నారు. మొత్తం రూ.87 వేల కోట్ల మేరకు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న రుణాలను మాఫీ చేయకపోవడంతో ఆ తర్వాత ఏటా రూ.14వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.56వేల కోట్లు వడ్డీగా, అపరాధ వడ్డీగా చెల్లించుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. గిట్టుబాటు ధరలు పెంచడంలోనే కాదని, గిట్టుబాటుధరలు పెరగకుండా చూడడంలో చంద్రబాబు పాలన రికార్డన్నారు. ఈ సంవత్సరం పదిలక్షల ఎకరాలకు పైగా భూమి బీడుగా పడి ఉందని, విత్తనం పడలేదన్నారు. దీనిపై చలనం లేదన్నారు. రుణాలు రాక, పెట్టుబడులు లేక పంట విస్తీర్ణం తగ్గిందన్నారు. సకాలంలవో వర్షాలు ప డక కొంత మేరకు పంటలు దెబ్బతింటే, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు, పంటలమీద, రైతుల ఆశల మీద మొత్తంగా రైతు జీవితం మీద చూపుతున్న ప్రభావాన్ని చర్చించేందుకు తీరిక లేదా అని జగన్ ప్రశ్నించారు. రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే సచివాలయంలో ఏమి చేస్తున్నారన్నాలరు. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున సహాయం ప్రకటించాలన్నారు.