రాష్ట్రీయం

పగబట్టిన వరుణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 15 రోజులుగా దాదాపు నగరం యావత్తూ వానలతో బెంబేలెత్తిపోతోంది. ఈ సీజన్‌లో తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే వర్షాలు ఎక్కువగా కురిశాయి. తెలంగాణలో ఏ ప్రాంతంలో లేనివిధంగా ఇక్కడ వానలు కురుస్తున్నాయి. వానల వల్ల ప్రధాన రోడ్లలో, కూడళ్లలో నీళ్లు పెద్దమొత్తంలో నిలిచిపోయి, వాహనాల రాకపోకలకు ఇబ్బంది తప్పడం లేదు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, చాదర్‌ఘాట్, నాగోల్, ఉప్పల్, ఎల్‌బి నగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల స్తంభన రొటీన్ అయపోయంది. ఈ ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ దూరం వెళ్లేందుకు అరగంట నుండి రెండు గంటల సమయం పడుతోంది. మూసీలో సాధారణ సమయం కంటే వరద ఎక్కువగా ఉంటోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మూసిలో కలిసే చిన్న చిన్న వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి.
అక్టోబర్ ఒకటి నుండి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 51 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావలసి ఉండగా, 228 మిల్లీమీటర్లు కురిసింది. రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో కూడా ఇంత వర్షం నమోదు కాలేదు. కరీంనగర్‌లో 46 మీల్లీమీటర్లు నమోదు కావలసి ఉండగా, 113 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ కాంక్రీట్ మయం కావడంతో వేడి ఎక్కువగా ఉంటోంది. పగటివేళ సూర్యరశ్మికి సిమెంట్ భవనాలు, సిమెంట్‌రోడ్లు వేడెక్కి, వాతావరణం వేడిగా మారుతోంది. ఈ వేడి సాయంత్రానికి మేఘాల్లోకి చేరి వర్షం కురుస్తోంది. క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడటంతో హైదరాబాద్‌పై వర్షం ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. ఇలాఉండగా బంగాళాఖాతంలో వచ్చే రెండురోజుల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. తర్వాత ఇది వాయుగుండంగా మారవచ్చని వెల్లడించారు. దాంతో దీపావళి తర్వాత మళ్లీ తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.