రాష్ట్రీయం

పాలమూరుకు దీపావళి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: పాలమూరు జిల్లాకు మరీ ముఖ్యంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి దీపావళి పండగ నాలుగు రోజుల ముందే వస్తోంది. 30 ఏళ్ల నుండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు పేపర్లలలో వస్తోందే తప్ప, నీళ్లు మాత్రం కల్వకుర్తికి రాలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న చొరవ, నీటిపారుదల మంత్రి టి. హరీష్‌రావు కృషితో కృష్ణా జలాలు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచి 122 కిలోమీటర్ల వద్ద కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ ప్రారంభమవుతుంది. సరిగ్గా ఇదే స్థలంలో ఆదివారం హరీశ్‌రావు కృష్ణానీటిని కల్వకుర్తికి విడుదల చేస్తున్నారు. అందుకే ఆదివారం కల్వకుర్తి ప్రజలకు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజుగా మిగిలిపోతోంది. కల్వకుర్తి నియోజకవర్గంలో సాగునీరు ఇచ్చేందుకు ఇప్పటి వరకు అడ్డంకిగా ఉన్న ఆవంచ అక్విడక్ట్ పనులు పూర్తి కావడంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లి వరకు సాగునీరు ఇచ్చేందుకు వీలవుతోంది. తక్షణమే 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మిగిలిన మరికొన్ని కాలువ పనులుపూర్తవగానే ఇంకో 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. భూసేకరణ జరగకపోవడం, అటవీ అనుమతులు పొందకపోవడం, బిల్లుల చెల్లింపులు సకాలంలో చెల్లించకపోవడం, కేంద్ర జలసంఘం లేవనెత్తిన సాంకేతిక అంశాలపై సమాధానం ఇవ్వకపోవడం, ప్రాజెక్టుల డిజైన్లను సకాలంలో పూర్తి చేయకపోవడం తదితర కారణాలవల్ల పనులు ముందుకు సాగలేదు. గత మూడేళ్లలో 123 జిఓ కింద భూసేకరణ జరిగింది. గతంలో భూసేకరణకు ఎకరాకు 30 వేల రూపాయలు చెల్లించగా, ఇప్పుడు ఎకరాకు ఐదులక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. గ్రీన్‌ఛానల్ రూపంలో నిధులు విడుదల చేశారు. హరీష్‌రావు చూపిన శ్రద్దతో ఆవంచ అక్విడక్ట్ పనులను మూడునెలలలోపే పూర్తి చేశారు. దాంతో కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోకి సాగునీటిని విడుదల చేసేందుకు వీలవుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపు 25 టిఎంసిల నుండి 40 టిఎంసిలకు పెంచారు. ఇందుకోసం 2016 లోనే జీఓ జారీ చేశారు. దాంతో కాలువ చివరలో డి-82 ద్వారా మరో 38 వేల ఎకరాలకు సాగునీరు అందేందుకు వీలవుతోంది. ప్యాకేజీ 29 కింద టెయిల్‌ఎండ్ డిస్ట్రిబ్యూటరీ తవ్వకం పూర్తయితే మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అంటే మొత్తం ఈ ఎత్తిపోతల ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతలకు 2014 జూన్ వరకు కాంగ్రెస్ హయాంలో 2716 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, గత మూడేళ్లలో టిఆర్‌ఎస్ హయాంలో 1121 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2017-18 బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. 2017-18 రబీలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. 2018 ఖరీఫ్ వరకు మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు.