రాష్ట్రీయం

ఎందుకీ పీటముడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలుగు అకాడమి విభజన విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో పీటముడిపడింది. తెలుగు అకాడమి పేరిట బ్యాంకుల్లో 300 కోట్ల రూపాయిల మేర ఫిక్సిడ్ డిపాజిట్లు ఉండటంతో ఆ నిధులు ఎవరు తీసుకోవానే అంశంపై అస్పష్టతే దీనికి కారణమని తెలిసింది. ఆ నిధులను పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ చెబుతుండగా, ఎక్కడి ఆస్తులు అక్కడవేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాలు ఈ అంశంపై న్యాయస్థానాలను ఆశ్రయించాయి. తెలుగు అకాడమికి విద్యాశాఖా మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. విద్యాశాఖ (గతంలో సాంస్కృతిక శాఖ) ముఖ్యకార్యదర్శి ఉపాధ్యక్షుడిగా ఉంటారు. తెలుగు అకాడమి పాలక మండలికి విద్యా మంత్రి చైర్మన్‌గానూ, పరిపాలనా స్థాయి సంఘానికి ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అకాడమి కీలకమైన మూడు విభాగాల సమన్వయంతో పనిచేస్తుంది. అందులో ప్రధానమైనది పాలక మండలి. దీనికి సహకరించేందుకు పరిపాలనా స్థాయి సంఘం, విద్యా విషయక స్థాయి సంఘం ఉంటాయి. పాలక మండలి అనుమతి లేకుండా ఒక్క నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు.
ఈ మండలిలో వివిధ వర్శిటీల విసిలు, విద్యాశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన అనంతరం పాలక మండలితో పాటు స్థాయి సంఘాలు కూడా రద్దయ్యాయి. వాటి సమావేశాలు జరగడం లేదు, వాటి పరోక్షంలోనే తాత్కాలిక సంచాలకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వాలన్నా పాలక మండలిలో నిర్ణయం తీసుకోవాలి. పాలక మండలి అనుమతి లేకుండానే ప్రస్తుతం చాలా పనులు జరిగిపోతున్నాయి. తెలుగు అకాడమి తెలంగాణ ఇంటర్మీడియట్ పుస్తకాలకు పరిమితం కావడంతో ఆంధ్రాలో ఉన్న విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం కేంద్రాల సిబ్బందిని కూర్చోబెట్టి అకాడమి పోషిస్తోంది. కనీసం ఈ కేంద్రాల్లో పుస్తకాలు అమ్మే పరిస్థితి కూడా లేదు. దానికి కారణం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రాకు సంబంధించిన పుస్తకాల ముద్రణను తెలుగు అకాడమి పూర్తిగా నిలిపివేసింది. ఆంధ్రా రాష్ట్రం తమ కరిక్యులమ్‌లో మార్పులు చేర్పులూ చేసుకుంటూ పోతున్నా అందుకు తగ్గట్టు కొత్త పుస్తకాల ముద్రణ పనిని తెలుగు అకాడమి చేపట్టలేదు. కొన్ని పుస్తకాలను మాత్రం ఆంధ్రా ప్రభుత్వం ప్రభుత్వ ముద్రణ సంస్థకు, కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. లక్షలాది రూపాయిలు కాపీరైట్ చెల్లించి తీసుకున్న రైట్స్‌ను తెలుగు అకాడమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. అకాడమి తరఫున ఆంధ్రాలో పనిచేస్తున్న సిబ్బందికి పనిలేకుండా పోయింది. ఊరికే జీతాలు ఇస్తున్నార్లే అనే ఆనందంలో అక్కడ సిబ్బంది ఉండగా, తెలంగాణ ప్రభుత్వం తెలుగు అకాడమి సిబ్బందికి పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెర్చి అసిస్టెంట్లను రీసెర్చి ఆఫీసర్లుగా, రీసెర్చి ఆఫీసర్లను డిప్యుటీ డైరెక్టర్లుగా, మేనేజర్లను ఆఫీసర్లుగా, పబ్లికేషన్ అసిస్టెంట్లను రీసెర్చి అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఒకే మారు ఆర్డర్లు ఇవ్వకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. దశల వారీ వీరి పదోన్నతులను అమలులోకి తెచ్చారు. పోస్టులు లేకుండానే పదోన్నతులు కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. డైరెక్టు రిక్రూట్‌మెంట్ పోస్టులను మళ్లించి పదోన్నతులు కల్పించగా, మరికొన్ని పోస్టుల విషయంలో వేరే విభాగాల పోస్టులను కన్వర్షన్ చేసినట్టు తెలిసింది.
మూడేళ్లుగా తాత్కాలికమే
సంచాలకుడి పోస్టును ఎవరు భర్తీ చేయాలనే అంశంపై మీమాంసతో తాత్కాలిక డైరెక్టర్‌నే కొనసాగిస్తున్నారు. ఆయనకు పూర్తి అధికారాలు లేకపోవడం, ప్రతి పనికీ సచివాలయ అధికారుల అనుమతి పొందాల్సి ఉండటంతో అకాడమి నిస్తేజంగా తయారైంది. 50 ఏళ్ల ఉన్నత స్థాయి సంస్థ జాతీయ సంస్థగా ఎదగాల్సింది పోయి, ఇపుడు అకాడమి మరింత కుచించుకుపోయింది.