రాష్ట్రీయం

ప్రతిభతో ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రానున్న కాలంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పూర్తిగా చదివించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పుడిస్తున్న 6,500 ప్రతిభా పురస్కారాలకు మరో వెయ్యి జోడిస్తామని, ఇందుకోసం అదనంగా రూ.30 కోట్లు కేటాయస్తా మని సిఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాల్సి ఉందన్నారు. తల్లిదండ్రులపై ఆధారపడకుం డా, విద్యార్థులు తమ ప్రతిభా పురస్కారాలతో చదివే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. దివంగత మాజీ రాష్టప్రతి, ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఎపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రధాన వేడుకలో చంద్రబాబు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తపించిన వైజ్ఞానికుడు, మేధావి, రాష్టప్రతిగా పనిచేసి స్ఫూర్తిప్రదాతగా నిలిచిన అబ్దుల్ కలాం జయంతి రోజున పురస్కారాలు ప్రదానం చేయడం సముచిత సందర్భమన్నారు.
టెన్త్‌లో మెరిట్ స్కాలర్‌షిప్ వచ్చిన వారిని ప్రభుత్వ ఖర్చులతో ఇంటర్మీడియట్ చదివిస్తామని ప్రకటించారు. ఇంటర్‌లో మెరిట్ స్కాలర్‌షిప్ సాధించేవాళ్లు భవిష్యత్ లో ఏ కోర్సులో చేరాలన్నా సహకరిస్తామని, బిట్స్ పిలానీ, ఐఐటి, ఐఐఎంలలో ఎక్కడైనా చదివించడానికి సిద్ధమన్నారు. డిగ్రీ నుంచి పీజీకి వెళ్లినా, విదేశాల్లో అయినా చదివిస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నాలెడ్జి ఎకానమీకి ప్రాధా న్యం వస్తుందన్నారు. తాను పాతికేళ్ల క్రితమే ఈ విషయం చెప్పానని చంద్రబాబు గుర్తుచేశారు. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కావని, చదువు- సంస్కారమన్నారు. మన ఆచార వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థను కాపాడాలన్నారు. పిల్లలకంటే తల్లిదండ్రులే ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పారు. 1995లో తాను సిఎం అయినప్పుడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చానని, ఆనాడు ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక మాధ్యమిక పాఠశాల, 5 కిలోమీటర్ల దూరంలో కాలేజీ, రెవెన్యూ డివిజన్‌కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని భావించి ప్రయత్నించామన్నారు. 30 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయన్నారు. తర్వాత తొమ్మిదేళ్లలో 300కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినట్లు తెలిపారు. చదువు తెలివిని ఇస్తుందని, చదువు ద్వారా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చన్నారు. కాలేజీలు పెడితేనే లాభం లేదు, అందరికీ ఉపాధి, అద్యోగావకాశాలు రావాలన్న ఉద్దేశంతో ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని, ఫలితంగా ఇక్కడ ఐటీలో లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఐటీ ఇంజనీర్లలో 25శాతం మంది మనవాళ్లు ఉన్నారని, ఇందుకు తాను వేసిన బీజమే కారణమని చెప్పారు. ఐఐటీలకు 18శాతం మన విద్యార్థులే ఎంపికవుతున్నారని, ఇదెంతో గర్వకారణమని చెప్పారు. మన జనాభా 4.5 శాతం ఉంటే 18 శాతం సీట్లు మన విద్యార్థులకే
వస్తున్నాయని, పోటీ ఉన్నప్పటికీ ఇది సాధిస్తున్నారంటే మన పిల్లలు ఎంతో ప్రతిభావంతులన్నారు. ఒకప్పుడు బిట్స్ పిలానీకి అందరూ మన విద్యార్థులే వెళ్లేవారని, వాళ్లకు అసూయ వచ్చి బిట్స్ పిలానీ విధివిధానాల్లో మార్పు చేశారని, వాళ్లు ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని నిబంధనలు విధించినా ప్రతిభతో మనమే ముందున్నామని నిరూపించినట్లు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తాను అన్ని అవకాశాలూ సృష్టిస్తానని చెప్పారు.
విద్యోన్నతి పథకాల ద్వారా విదేశాల్లో చదువుకునే అవకాశాలు సృష్టించామని చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులు 1000 మంది, ఈబీసీలు 750, కాపులు 1000, ఎస్సీలు 1000 మంది, ఎస్టీలు, మైనార్టీలు 750.. మొత్తం 4,500 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలిచ్చామని చెప్పారు. 45,571 మంది విద్యార్థులను వ్యవసాయ కోర్సులకు ఎంపిక చేశామని తెలిపారు. మెడికల్ ఎంట్రన్స్‌కు 36వేల 50 మంది మన విద్యార్థులు అర్హత సాధించారని ఈసందర్భంగా సిఎం వివరించారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు విలువైన, ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆర్థికంగా లోటు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రూ.23,209 నిధులు విద్యా శాఖకు కేటాయించిందని గంటా వివరించారు.

చిత్రం..విజయవాడలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభలో కలాంకు నివాళి అర్పిస్తున్న సిఎం చంద్రబాబు