రాష్ట్రీయం

కల్వకుర్తి ఒడిలో కృష్ణమ్మ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: కల్వకుర్తి ప్రాంత రైతులకు మూడు రోజులు ముందుగానే దీపావళి పండుగ వచ్చిందని, దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న కృష్ణాజలాలు తమ బీడువారి నెర్రలు బారిన పొలాల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కడం అంటేనే అంతకన్నా పండుగ మరేముంటుందని ఇది రైతులకు దీపావళి ధమాకానేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఎలికట్టతండా సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి వస్తున్న కృష్ణాజలాలకు మంత్రి జలపూజ చేసి నీటిని కల్వకుర్తి వైపు వదిలారు. అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రైతులకు కృష్ణాజలాలను తీసుకువస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం అసూయ, అసహనంతో రగిలిపోతున్నారని అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు ఇస్తే తమ రాజకీయం ఏమైపోతుందోనని వారు అసహనం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1984లో కల్వకుర్తి ప్రాజెక్టుకు జిఓ వచ్చిందని కానీ పనలు మాత్రం చేయలేదని ఆరోపించారు. కెసిఆర్ ఉద్యమంలోకి దిగిన తరువాత పనులు ప్రారంభిస్తున్నట్లు శిలాఫలకాలు వేసి వదిలేశారని ఆరోపించారు. ఏనాడు కూడా కాంగ్రెస్, టిడిపి నాయకులకు రైతులకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచనే లేదని విమర్శించారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా
కల్వకుర్తి రైతాంగానికి ఈ ఏడాది 32 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులు కేవలం 50 శాతం మాత్రమే చేశారని ఆ పనులు కూడా సగం సగం చేసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుండి కృష్ణాజలాలను అక్రమంగా దాదాపు 55 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే చేతులు కట్టుకుని కూర్చున్న కాంగ్రెస్ నాయకులు తమ చిత్తశుద్ధిని శంకిస్తారా అంటూ మండిపడ్డారు. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరో రూ.1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడగాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్త్తోందని, ఆ దిశగా తామంతా పని చేస్తున్నామని చెప్పారు. సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కల్వకుర్తి సమీపంలోని ఎల్లికట్టతండా దగ్గర కృష్ణా నీటిని విడుదల చేసి
జల పూజ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు