రాష్ట్రీయం

దిక్కుచూపిన కోకపేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన కోకపేట భూములపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చిచెప్పడంతో ఖజానాకు కాసుల వర్షం కురవబోతుంది. గతంలో వేలం వేసిన భూములతో పాటు, ఇంకా వేలం వేయని భూముల విలువ దాదాపు రూ.14 వేల నుంచి 15 వేల కోట్లు ఉంటుందని అంచన. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి చేపట్టే వౌలిక సదుపాయాలకు సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచన వేయగా, ఇందులో సగానికి సగం నిధులు కోకపేట భూములను తాజాగా వేలం వేస్తే సమకూరుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. వాస్తవానికి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధుల సేకరణ, రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలిపితే ప్రభుత్వానికి తలకుమించిన భారమే. అయితే తాజాగా కోకపేట భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో హైదరాబాద్ నగరంలో వౌలిక సదుపాయాలకు అయ్యే వ్యయంలో సగం నిధులు కోకపేట భూముల వేలంతోనే సమకూరే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కాంగ్రెస్ హయాంలో 2006-07లో ఉమ్మడి రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అదే బూమ్‌లో రంగారెడ్డి జిల్లా కోకపేటలో ప్రభుత్వానికి చెందిన 573 ఎకరాలను హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీకి (హెచ్‌ఎండిఎ), 50 ఎకరాలను ఇన్‌ఫర్మేషన్ టెకాల్నజీ సెజ్‌కు కేటాయించింది. హెచ్‌ఎండిఎకు కేటాయించిన భూములను వేలం వేయడం ద్వారా వచ్చే నిధులతో హైదరాబాద్ నగరంలో వౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు హెచ్‌ఎండిఎ తనకు బదలాయించిన 573 ఎకరాలలో మొదటి విడతలో 166 ఎకరాలను వేర్వేరు స్లాట్స్‌గా చేసి వేలం వేయగా ఒక్కో ఎకరాకు కనిష్టంగా రూ. 8 కోట్ల నుంచి గరిష్టంగా 14.5 కోట్లు పలికింది. వేలంలో స్థలాలు దక్కించుకున్న 15 సంస్థలు మూడు నాలుగు వాయిదాల్లో గడువులోగా చెల్లించి వీటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే చెల్లించాల్సిన మొత్తం రూ.1760 కోట్లకుగాను కేవలం రూ.660 కోట్లు మాత్రమే చెల్లించాయి. ఇంతలో ప్రభుత్వం వేలం వేసిన భూమితో పాటు కోకపేట పరిసర ప్రాంతాలకు చెందిన 1635 ఎకరాలకు తాము యజమానులమని కెఎస్‌పి అలీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తమకు చెందని భూమిని ప్రభుత్వం వేలం వేసిందని, అందువల్ల తాము చెల్లించిన డబ్బును వడ్డీ సహా తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇప్పించాలంటూ వేలంలో పాల్గొన్న సంస్థలు కూడా కోర్టును ఆశ్రయించాయి. హెచ్‌ఎండికి బదలాయించిన భూములకు యజమాని, హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. వేలంలో కొనుగోలు చేసిన సంస్థలు ఒప్పందం మేరకు గడువులోగా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోవడంతో, ఇప్పుడు వీటిని రద్దు చేయాలని ప్రభుత్వం
భావిస్తుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో హెచ్‌ఎండిఎ, రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఇటీవల సమావేశమై చర్చించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో గతంలో వేలం వేసిన భూములతో పాటు మిగిలిన 407 ఎకరాలను కూడా తాజాగా వేలం వేస్తే ఎకరాకు కనిష్టంగా రూ. 25 కోట్ల చొప్పున సుమారు రూ. 14 నుంచి 15 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచన వేసారు. ఈ మొత్తాన్ని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి చేపడుతున్న పనులకు వినియోగించుకొని మిగతా మొత్తాన్ని ఆర్థిక సంస్థల నుంచి రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.