రాష్ట్రీయం

ఇక ఆర్థిక కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: దేశంలోని ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు రెవెన్యూలో మిగులు సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాదీ (2017- 18) రెవెన్యూ మిగులు దశకు చేరాలని నిర్దేశించుకున్నా, ఆ పరిస్థితి సాధ్యమేనా అన్న అనుమానాలు లేకపోలేదు. ఇప్పటివరకూ పేదల సంక్షేమం, అభివృద్ధి పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, గత నాలుగు నెలలుగా మిగులు నుంచి రాష్ట్రం మెల్లగా లోటుకు జారుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ్భాగం పూరె్తైంది. ఉన్నది మరో ఐదున్నర నెలలు మాత్రమే. అందుకే ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్థిక పరిస్ధితి బలోపేతం చేయడంపై ప్రభుత్వం దశలవారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అర్థ ఏడాదిలో మిగులు బడ్జెట్‌కు చేరడం ఖాయమని అధికారులైతే ధీమాగానే చెబుతున్నారు. ఆర్ధిక సంవత్సరం మధ్యలో ఒక నెల మిగులు, మరో నెల లోటు హెచ్చుతగ్గులు సర్వసాధారణమని, డిసెంబర్ నుంచి రాష్ట్రాదాయం పుంజుకుని మిగులులోకి వెళ్తామని ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్ పంట 43 లక్షల హెక్టార్లకు, దాదాపు 39 లక్షల హెక్టార్లలో సాగవడం, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండటం, జల విద్యుత్ అందుబాటులోకి రావడం, విద్యుత్ కొరత లేకపోవడం, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలుకావడంతో రాష్ట్ర ఆర్ధిక
పరిస్థితి వచ్చే రెండు నెలల్లో పుంజుకుంటాయని ఆర్ధిక శాఖ అంచనా వేసింది. రబీకి కూడా పుష్కలంగా నీటి లభ్యత, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటం వల్ల బంపర్ పంట దిగుబడులపై పెద్ద అంచనా ఉంది. ప్రభుత్వం చేపట్టిన భూమి సర్వే పనులు వేగవంతంగా కొనసాగడం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు ఎకరానికి రూ.8వేల సబ్సిడీ ఇవ్వాలన్న నిర్ణయం అమలువల్ల ఖజనాపై భారమేమీ ఉండదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. జిఎస్టీని నిర్మాణంలోని ప్రాజెక్టులు, ఇతర పనులకు 12నుంచి ఐదు శాతానికి తగ్గించడం వల్ల ఖజానాపై కొంతమేర భారం తగ్గింది. ఇవన్నీ వచ్చే ఆరు నెలల్లో ఆర్ధిక రంగం బలం పుంజుకోడానికి దోహదపడనున్నాయి.
2017-18 ఏప్రిల్ నెలలో రూ.308.2 కోట్ల రెవెన్యూ మిగులును తెలంగాణ చూపింది. కానీ మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మిగులు నుంచి లోటులోకి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడంవల్ల ఈ పరిస్ధితి తలెత్తినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో 85 శాతం మంది బలహీన వర్గాల ప్రజలు ఉన్నందున, సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆర్ధిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం ఆరు నెలల్లో రూ.1859.16 కోట్లు వచ్చింది. ఈ ఏడాది మొత్తంపైన మూడు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ రాష్ట్భ్రావృద్ధికి కొలమానం భూమి క్రయ విక్రయాలు. ఈ రంగంలో ఆరు నెలల్లో సగానికి పైగా ఆదాయం తొలి ఆరు నెలల్లో రావడం మంచి పరిణామమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయి ఆవిర్భవించిన వేళ రెవెన్యూ మిగులు పరిస్ధితి ఉంది. 2014-15లో రూ. 369 కోట్ల మిగులు, 2015-16లో రూ. 238కోట్లు, 2016-17లో రూ. 4459.97 కోట్ల రెవెన్యూ మిగులను తెలంగాణ సాధించింది. ఏప్రిల్‌లో రూ.308 కోట్ల మిగులు కొనసాగితే, మే నెలలో రూ. 2673.13 కోట్లు, జూన్ నెలలో రూ. 2080.97 కోట్లు, జూలై నెలలో రూ.3176.10 కోట్లు, ఆగస్టు నెలలో రూ. 2812.85 కోట్ల లోటు వచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సగభాగం ముగిసింది. ఇకపై సంక్షేమ, అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యత తగ్గించకుండా, ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. దీనిపై సిఎం కె చంద్రశేఖరరావు ప్రత్యేక కసరత్తును అసెంబ్లీ సమావేశాల తర్వాత చేపట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆరు నెలల్లో రెవెన్యూ వసూళ్లు రూ. 32,938.43 కోట్లు ఉండగా, ఖర్చు రూ.35, 751.28 కోట్లు ఉంది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 13,986 కోట్ల మేర రుణాలు తెచ్చింది. ఇందులో పెట్టుబడి ఖర్చు కింద రూ.10వేల కోట్లను కేటాయించింది. మిగిలిన నాలుగు వేల కోట్ల నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టారు.